అవును దుర్గగుడి మాజీ ఈవో సురేష్‌బాబుని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోనుంది. రాజమండ్రి దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్‌గా సురేష్‌బాబుని నియమిస్తూ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. గతంలో అవినీతి ఆరోపణలతో సురేష్‌బాబును ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. కానీ తాజాగా రాజమండ్రి ఆర్జేసీగా సురేష్‌బాబును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి మోహన్ రాజమండ్రి ఆర్జేసీ బాధ్యతలను సురేష్‌బాబుకు అప్పగించనున్నారు. నిజానికి సురేశ్‌బాబుకు ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం షాకిచ్చింది. సురేశ్‌బాబు ఆర్జేసీ హోదాను దేవాదాయశాఖ‌ ర‌ద్దు చేసింది.


 అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో కొద్ది రోజుల క్రితమే సురేష్‌బాబును రాజమహేంద్రవరం ఆర్జేసీగా ప్రభుత్వం బ‌దిలీ చేసింది. ఆర్జేసీ నియామ‌క‌పు ఉత్తర్వులను ర‌ద్దు చేస్తూ జీవో 208 కూడా విడుదల చేశారు. దేవాదాయశాఖ క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో రిపోర్టు చేయాల‌ని సురేష్‌బాబుకు ఆదేశాలు చేశారు. బెజవాడ దుర్గమ్మ ఈవో సురేశ్‌బాబు స్థానంలో రాజమహేంద్రవరం రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌గా ఉన్న డి.భ్రమరాంబను దుర్గగుడి ఈవోగా నియమిస్తూ నెల క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 


సురేశ్‌బాబును భ్రమరాంబ స్థానంలో రాజమహేంద్రవరం ఆర్జేసీగా నియమించారు. అనంతరం ఆయనకు  ఆర్జేసీ హోదా తొలగించగా ఇప్పుడు ఆ హోదా మళ్ళీ కట్టబెట్టారు. ఇక సురేశ్‌బాబు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్ళలో దుర్గగుడి ఈవోగా నియమితులయ్యారు. దుర్గగుడిలో అడుగుపెట్టిన నాటి నుంచి పలు ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన చివరికి అవినీతి ఆరోపణలతో వైదొలగాల్సి వచ్చింది. తాత్కాలిక పదోన్నతిపై డిప్యూటీ కమిషనర్‌ హోదాలో ఉన్న సురేశ్‌బాబును జాయింట్‌ కమిషనర్‌ స్థాయి ఆలయమైన దుర్గగుడికి ఈవోగా నియమించడంపై అప్పట్లో విమర్శలు వచ్చినా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. వెండి సింహాలు ఘటన సహా అనేక అంశాలలో ఆయన పని తీరు, ఆరోపణల నేపధ్యంలో ఆయనని ప్రభుత్వం పక్కన పెట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: