ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది  ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తాగునీటి సమస్యను తీర్చేందుకు మిషన్ భగీరథ అనే మహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం.  తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి ఎంత గానో ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో ఫ్లోరైడ్ సమస్య కారణంగా నీటిని తాగాలి అంటే భయపడే పరిస్థితి. ఒకవేళ తాగిన ఎన్నో ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే మరికొన్ని ప్రాంతాల్లో కనీసం తాగునీరు లభించని స్థితి. ఇలాంటి తరుణంలోనే తెలంగాణలో ఇలాంటి సమస్యలు దూరం కావాలనే గొప్ప సంకల్పంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం.


 అయితే పసి కూనగా ప్రారంభమైన తెలంగాణలో మిషన్ భగీరథ ను ఎంతో సమర్థవంతంగా సత్వరంగా పూర్తి చేయడానికి ఒక అద్భుతమైన కార్య చతురత కలిగిన  ధీశాలి కావాల్సి వచ్చింది  ఈ క్రమంలోనే ఉద్యమంలో కీలక నేతగా ఉన్న హరీష్ రావు ని ఇక అటు ప్రజల తాగునీటి సమస్యలను తీర్చడంలో కూడా ముందుండేలా నీటిపారుదల శాఖ మంత్రిగా చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఆ తర్వాత మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టి నాటి నుంచి వేగంగా అమలు చేయడంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చేసిన కృషి అసామాన్యమైనది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.




 ఒకవేళ హరీష్ రావు అనే వ్యక్తి లేకపోతే మిషన్ భగీరథ అంతా సమర్థవంతంగా సత్వరంగా పూర్తయ్యేది కాదేమో అని అనిపించక మానదు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన మిషన్ భగీరథ ను దేశానికే ఆదర్శంగా నిలిచేలా చేసారు హరీష్ రావు. కేంద్ర ప్రభుత్వం సైతం మిషన్ భగీరథ తరహాలోనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమయింది అంటే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే మిషిన్ భగీరథ అంత త్వరగా  విజయవంతం అవడానికి అటు హరీష్ రావు మాత్రమే కారణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: