ఇక తమ పాలసీల ద్వారా అందరికీ ఆర్థిక భద్రత కల్పిస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇక ప్రస్తుతం పిల్లల కోసం ఎల్ఐసి న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ పాలసీ అందిస్తోంది. ఇందులో 12 ఏళ్లలోపు వయస్సు ఉన్న పిల్లలు చేరేందుకు అవకాశం ఉంటుంది గరిష్ఠంగా 10 వేల బీమా మొత్తానికి పాలసీ పొందవచ్చు. ఇక ఈ పాలసీలో గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు ఇక ఈ పాలసీ యొక్క టర్మ్ ప్లాన్ 25 ఏళ్ళు ఉంటుంది. 25 ఏళ్ల వరకు ప్రతి నెలా కొంత మొత్తాన్ని జమ చేస్తూ వెళ్లాలి. ఇక ఆ తర్వాత ఇక మధ్యలో పిల్లల చదువుల కోసం కొంత మొత్తాన్ని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.
పిల్లలకు 18 ఏళ్ళు వచ్చిన సమయంలో పాలసీలో 20% డబ్బులు తీసు కోవచ్చు.. ఇక 20 ఏళ్ళు వయస్సు వచ్చిన సమయంలో 20%.. 22 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మరో 20 శాతం డబ్బులు తల్లిదండ్రులకు అందిస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇక మిగతా 40 శాతం డబ్బులను పాలసీ గడువు ముగిసిన తర్వాత అందిస్తారు. ఒకవేళ మీరు ఐదేళ్ల వయసులో పిల్లల పేర్లు పై పాలసీ తీసుకుంటే నెలకు 4,300 రూపాయలు ప్రీమియం చెల్లించాలి అంటే రోజుకి 150 రూపాయలు పొదుపు చేస్తే సరిపోతుంది. ఇక మెచ్యూరిటీ సమయం పూర్తయిన తర్వాత 19 లక్షలు లభిస్తాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి