కరోనా పేరెత్తితే చాలు ప్రస్తుతం అందరూ భయపడిపోతున్నారు. ఇక కరోనా వైరస్ సోకింది అంటే చాలు మానవత్వం మరిచి ఆమడ దూరం పరుగెడుతున్నారు. రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు అయినా సరే దూరం పెడుతున్న ఘటనలు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్నాయి. ఇక కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి అందరిలో ప్రాణం మీద తీపిని పెంచింది. దీంతో మనం బ్రతికి ఉంటే సరిపోతుంది అని స్వార్ధపరులు గా మారిపోయారు అందరూ. అయితే కరోనా సమయంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలి.



 లేదంటే పుట్టబోయే బిడ్డకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక నిండు గర్భిణీ మాత్రం అవన్నీ లెక్క చేయలేదు.  తన ప్రాణాల కంటే తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కంటే తన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే  ముఖ్యం అని అనుకుంది ఇక్కడ ఒక మహిళ. నిండు గర్భిణీ  అయినప్పటికీ కరోనా రోగుల మధ్య తిరిగింది. ఇక  కరోనా వైరస్ పేరెత్తితేనే జనాలు భయపడుతున్న తరుణంలో నిండు గర్భిణి అయిన కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ధైర్యం నింపింది.  ఇలా గర్భిణీ అయినప్పటికీ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు   ముందుకు కదిలిన ఆ మహిళ మూర్తి పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.



 తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఏఎన్ఎం ఈ సాహసం చేస్తోంది.  ఆమె ప్రస్తుతం నిండు గర్భవతి.  గర్భవతి అన్న తర్వాత ఎన్నో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలి..  కరోనా రోగులు ఉన్న చోటికి అసలు వెళ్ళకూడదు. కానీ ఇక్కడ ఏఎన్ఎం వెంకటలక్ష్మి మాత్రం అలా ఊరికే కూర్చోలేదు.  తన విధి నిర్వహణలో తన ప్రాణాలనే కాదు తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు సిద్ధమైంది.  నిండు గర్భంతో ఉన్నప్పుడు ధైర్యసాహసాలతో కరోనా రోగులకు ఆమె చేస్తున్న సేవలు చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఆమెకు హాట్సాఫ్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: