భారత ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విద్యార్హతలపై ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. కరోనా వ్యాప్తి నియంత్రణలో మోడీ పూర్తిగా విఫలమైనప్పుడు కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చర్చ నడిచింది. ఒక చాయ్ వాలాకి దేశం లో ఏం జరుగుతుందో.. ఆక్సిజన్ సిలిండర్లు లేక ఎంత మంది చనిపోతున్నారో.. మహమ్మారి కట్టడం కొరకై ఏం చర్యలు చేపట్టాలో.. కించిత్ అయినా ఐడియా ఉందా? అని మొన్నటి వరకు అనేక విమర్శలు వెల్లువెత్తాయి.

ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు.. బాగా చదువుకున్న రాహుల్ గాంధీ లాంటి రాజకీయ నాయకుడు ప్రధానమంత్రిగా ఎన్నికైతే దేశం బాగుపడుతుందని.. మోడీ లాంటి అజ్ఞాని, పామరుడు కారణంగా దేశం తల్లడిల్లుతోందని వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. 8వ ఎక్కం కూడా చెప్పలేని మోడీ ఎక్కడ.. హార్వర్డ్ స్టూడెంట్ రాహుల్ గాంధీ ఎక్కడ..? అని నిర్మొహమాటంగా కాంగ్రెస్ నేతలు ప్రశ్నించిన సందర్భాలు కోకొల్లలు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చదువు పై సంచలన ఆరోపణలు చేశారు. అప్పట్లో ప్రధాని చదువు గురించి పెద్ద గొడవే జరిగిందని చెప్పుకోవచ్చు.

అయితే ఆ క్రమంలోనే మోడీ ఉన్నత విద్యను అభ్యసించారని చెబుతూ రెండు సర్టిఫికెట్స్ ని బీజేపీ నేతలు మీడియా ముందు ఉంచారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ లో డిగ్రీ పూర్తి చేశారని.. 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ లో ఎంఏ పూర్తి చేశారని ఎలక్షన్ అఫిడవిట్లలో పేర్కొన్నారు కానీ ప్రతిపక్ష పార్టీ నేతలు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తూ మోడీ తన విద్యార్హత గురించి అబద్ధం చెబుతున్నారని ఆరోపిస్తుంటారు. మత రాజకీయాలు, కుట్రలు కుతంత్రాలు చేసి ప్రధానమంత్రి పదవిని అధిష్టించినప్పటికీ.. ఆయన అజ్ఞానం ఏంటో తేటతెల్లమైందని కూడా ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తుంటారు.

ఇకపోతే నాలుగేళ్ల వయసులోనే ఒకటో తరగతిలో చేరిన రాహుల్ గాంధీ 13-14 ఏళ్ల వయసులోనే పదో తరగతి చదవాల్సి ఉంది కానీ భద్రతా కారణాల దృష్ట్యా ఆయన పాఠశాలకు వెళ్ళలేదు. ఆయన హోమ్ స్కూల్ విద్య ను ఆశ్రయించారు. ప్రాధమిక విద్యను ఎలాగోలా అభ్యసించిన ఆయన ఆ తర్వాత ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ లో జాయిన్ అయ్యారు. తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో చేరేందుకు ఆయన అమెరికాకు వెళ్లారు కానీ వ్యక్తిగత విషయాల వల్ల స్వదేశానికి తిరిగి వచ్చారు. మళ్ళీ అమెరికా కి వెళ్లి ఫ్లోరిడాలోని రోలిన్స్ కళాశాలలో చేరి 24 సంవత్సరాల వయసులో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇంగ్లాండ్ లోని ట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఫిల్ పూర్తి చేశారు. అప్పటికి ఆయన వయస్సు 25 సంవత్సరాలు.

అయితే రాహుల్ గాంధీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పై కూడా విమర్శలు వచ్చాయి. ఆ సందర్భంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం క్లారిటీ ఇచ్చింది. రాహుల్ గాంధీ ట్రినిటీ కళాశాల విద్యార్థి అని, 1995లో డెవలప్‌మెంట్ స్టడీస్ లో ఎం.ఫిల్ డిగ్రీ పొందారని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పునరుద్ఘాటించడంతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: