నేడు సీఎం కేసీఆర్ సిద్దిపేట‌లో ప‌ర్య‌టించి ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ సంధ‌ర్భంగా భాగంగా సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో నాలుగు వెట‌ర్న‌రీ కాలేజీల‌ను ఏర్పాటు  చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. సిద్ధిపేట‌తో స‌హా నిజామాబాద్, వ‌రంగ‌ల్ జిల్లాల్లో కాలేజిల‌ను నిర్మిస్తామ‌ని చెప్పారు. అంతే కాకుండా ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం గురించి మాట్లాడిన కేసీఆర్ ప్రజా ప్రతినిధుల మీద చాలా పెద్ద బాధ్యత ఉందన్నారు. వారు నేల విడిచి సాము చేయవద్దని తెలిపారు. రాష్ట్రంలో 98.6 శాతం  వైకుంఠ దామాలు పూర్తి అయ్యాయి అని చెప్పారు. ఆక్సిజన్ కొనుక్కోవడం ఆంటే సమాజం సిగ్గు పడాలన్నారు. గత ప్రభుత్వాలు నేల విడిచి సాము చేశాయని, పెద్ద పెద్ద డైలాగు లు చెప్పార‌ని అన్నారు. 

ఆకస్మిక తనిఖీ అంటే అధికారులు, సర్పంచ్ లను బద్నాం చేయడం త‌న‌ ఉద్దేశ్యం కాదని...చాలా మంది పిచ్చి కూతలు కూస్తున్నారు, అవేమి పట్టించుకోమ‌ని అన్నారు. మిష‌న్ భగీరధ చూడడానికి 11 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు త‌ర‌లివ‌చ్చార‌ని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కడితే  కొన్ని కుక్కలు  మొరిగాయని....ఏ కుక్క మొరిగినా బంగారు తెలంగాణ త‌ధ్యం అని అన్నారు. మల్లన్న సాగర్ అయిపోతే నెత్తి మీద కుండ ఉన్నట్లే అని వ్యాఖ్యానించారు. నేను బయలు దేరిన నాడు తెలంగాణ వస్తుందని ఎవరు నమ్మలేదని అన్నారు. కానీ తెలంగాణ సాధించామ‌ని చెప్పారు.

అలాగే 100 శాతం బంగారు తెలంగాణ అయి తీరుతుందంటూ స్ప‌ష్టం చేశారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ప్రాజెక్ట్ పేరు దేవుడు పేరు పెట్టామ‌ని తెలిపారు. మిడ్ మానేరు నాసి రకం గా కట్టామని చిల్లర రాజకీయాలు చేశారంటూ వ్యాఖ్యానించారు. ఎందుకూ పనికి రాని వాళ్ళు ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారంటూ కేసీఆర్ ప్ర‌తిప‌క్షాల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. దేశం లో ఏ రాష్ట్రం లో కూడా తెలంగాణ లో కొన్నట్లు ధాన్యం కొనలేదని అన్నారు. తెలంగాణకు సరి పోయే రైస్ మిల్లులు లేవని..కొనుగోలు కేంద్రాల దగ్గర రాజకీయ పార్టీలు ధర్నాలకి ప్రయత్నం చేస్తే రైతులు తన్ని పంపారంటూ వ్యాఖ్యానించారు.

దళిత వర్గం పేదరికం లో ఉందని, అసమానతలు పోవడం లేదని కేసీఆర్ అన్నారు. వాటిని పోగొట్టడానికి సీఎం దళిత ఎన్ఫోర్మేంట్ ప్రోగ్రాం కోసం బడ్జెట్ లో 1000 కోట్లు కేటాయించామని చెప్పారు. ఇండియాలోనే నంబర్ వన్ ధాన్యం పండించే రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ గ‌ర్వించారు. నేను పుట్టిన గడ్డ ఆదర్శ జిల్లా కావాలి అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: