
ఇక ప్రతి శాఖపై సీఎంవో నిఘా ఎక్కువుగా ఉండడంతో పెద్దగా ఎవరిపై అవినీతి ఆరోపణలు రాలేదనే వైసీపీ వాళ్లు అంటున్నారు. అయినా ఒకరిద్దరు మంత్రులపై అవినీతి, ఇతరత్రా ఆరోపణలు వచ్చాయి. సీఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసినప్పుడు మంత్రి గుమ్మనూరి జయరాం పై అవినీతి చేశారన్న ఆరోపణ అయితే బయటకు వచ్చింది. ఆయన అనుచరులు, బంధువుల పేకాట శిబిరాలపై విమర్శలు వచ్చాయి. ఇక కొడాలి నాని నియోజకవర్గంలోనే పేకాట స్థావరాలపై దాడులు చేశారు. ఇందులో మంత్రి ప్రమేయంపై కూడా వార్తలు వచ్చాయి.
ఇక మరో మంత్రి పెద్దిరెడ్డి ఇసుక దందా చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా అవినీతి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక కొందరు మంత్రులు శాఖా పరంగా అట్టర్ ప్లాప్ అయిపోయారన్నది తెలిసిందే. ప్రభుత్వం , పార్టీపై ఎన్ని విమర్శలు వచ్చినా బెల్లం ముక్క నోట్లో పెట్టుకుని ఏ మాత్రం మాట్లాడని వారు చాలా మందే ఉన్నారు. వీరంతా ఎగిరి పోనున్నారు. ఇక అవినీతి పరంగా మాత్రం పైన చెప్పుకున్న మంత్రులు మినహా మిగిలిన మంత్రుల నుంచి పెద్ద విమర్శలు అయితే లేవు. జగన్ వీరిని బాగా కట్టడి చేశారనే చెప్పాలి.