ఇటీవలే మిత్ర దేశమైన ఇజ్రాయిల్ నుంచి డ్రోన్ గార్డ్ వ్యవస్థను భారత్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటీవలే ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటనలో అటు భారత్ పేరును మాత్రం వెల్లడించలేదు ఇజ్రాయిల్. కానీ రక్షణ రంగ నిపుణులు మాత్రం ఇజ్రాయిల్ డ్రోన్ గార్డ్ వ్యవస్థను కొనుగోలు చేసింది భారత్ అని భావిస్తున్నారు. ఎందుకంటే ఇటీవలే భారత్లో డ్రోన్లతో దాడులు జరగడం సంచలనంగా మారిపోయింది. అంతేకాకుండా తమ డ్రోన్ వ్యవస్థపై భారత్ ఆసక్తి కనబరుస్తుంది అని గత ఏడాది ఇజ్రాయిల్ కు చెందిన ఉన్నతాధికారి చెప్పడం ఇక ఇప్పుడు ఈ అంచనాలకు తావిస్తోంది.
ఇప్పటికే భారత్ వద్ద ఎలాంటి డ్రోన్ రక్షణ రంగం వ్యవస్థ లేదు అంటూ రక్షణ నిపుణులు అభిజిత్ అయ్యర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇటీవల జమ్మూలోని డ్రోన్ల దాడి జరగడంతో డోన్ రక్షణవ్యవస్థ తప్పనిసరిగా కావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇజ్రాయిల్ నుంచి భారత్ డ్రోన్ గార్డ్ వ్యవస్థను విక్రయించినట్లు తెలుస్తుంది . అయితే ఇటీవలే ఇజ్రాయిల్ చెప్పిన డ్రోన్ గార్డ్ వ్యవస్థ ఒక వైపు నుంచి వచ్చే దాడులను మాత్రమే కాదు అన్నివైపుల నుంచి వచ్చే దాడులకు సైతం అడ్డుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందట. ఇందులో షార్ట్ మీడియం లాంగ్ రేంజ్ వేరియంట్లు కూడా ఉంటాయట. శత్రు దేశాల నుంచి వచ్చిన డ్రోన్లను అడ్డుకుని ఎంతో వేగంగా ఆ డ్రోన్లను పేల్చేయగల సామర్థ్యాన్ని ఈ డ్రోన్ గార్డ్ వ్యవస్థ కలిగి ఉంటుందట. ఇలా శత్రు దేశాల డోన్ నుంచి ఒక రక్షణ వలయాన్ని కలిగిస్తుందని ఇజ్రాయిల్ అధికారులు చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి