ఓవైపు ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న.. దేశంలో ఆక్సిజన్ కొరత వేధిస్తోన్నప్పటికీ మోడీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు అంటూ విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. ఇక ఇటీవల మరోసారి కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రస్తుతం దేశంలో టీకాల కొరకు ఎంతగానో వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత కారణంగా ఎంతోమంది నిరాశ చెందుతున్నారు. వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు వచ్చినప్పటికీ... టీకాల కొరతతో మళ్ళీ వెనుదిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
అయితే దేశంలో ఏర్పడిన టీకాల కొరతపై ఇటీవలే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో టీకాల కొరత వేధిస్తోంది అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు అందరికీ టీకాలు అందించేందుకు తమ ప్రభుత్వం శ్రమిస్తోంది అని మోడీ గారు చెబుతున్నారు.. కానీ కేంద్ర ప్రభుత్వానికి మాటలే కాని చేతలు లేవు అంటూ కేంద్రంపై మండిపడ్డారు రాహుల్ గాంధీ. టీకాలు ఎక్కడ అంటూ ప్రశ్నించారు. అంతేకాదు గతంలో ఒక మీడియా సంస్థ ప్రచురించిన వార్తను కూడా టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతూ ఉండటంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి