సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో మొదటి నిమిషం నుంచి సభలో ఏపి ఎంపీలు హక్కులు సాధనకు, రావాల్సిన నిధుల కోసం నిరసన గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. ఏపికి జరుగుతున్న అన్యాయంపై నినదిస్తున్నారు. రెండు రోజులు నుంచి పోలవరం అంశం పై వాయిదా తీర్మానం ఇచ్చి చర్చకు అనుమతివ్వాలని విజయసాయిరెడ్డి నేతృత్వంలోని ఎంపీలు ఇటు పార్లమెంట్ లోనూ, అటు రాజ్యసభలోనూ సభ ఆర్డర్ ను స్తంభింప చేస్తున్నారు. సీడబ్లూసీ టెక్నికల్ కమిటీ రూపొంచిన పోలవరం నిర్మాణాల అంచనాల ప్రకారం  రూ. 55 వేల 657 కోట్లను కేంద్రమే అందజేయాలని సభలో గట్టి డిమాండ్ వినిపిస్తున్నారు అధికారపార్టీకి చెందిన ఎంపీలు. పోలవరం రాష్ట్రానికి చెందిన ప్రాజెక్ట్ కాదని, జాతీయ ప్రాజెక్ట్ అని గుర్తు చేస్తున్నారు. పోలవరం నిర్మాణానికి అయ్యే ఖర్చంతా కేంద్రమే భరించాలని, 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఎంపీలు మాగంటి మాగుంట శ్రీనివసులు రెడ్డి, మార్గాని భరత్ లకు మీడియా కు వివరించారు. నాలుగు వేల కోట్లతో ప్రాజెక్ట్ పూర్తవుతుంది కానీ, నష్టపోతున్న నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని వివరించారు. ముంపు గ్రామాల ప్రజలను పూర్తిగా ఆదుకోవల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని, వారి కష్టాలను చూసే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ వ్యయాన్ని పెంచామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కిందే రూ. 34 వేల కోట్లును ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. ప్రధాని మోదీ దీనిపై తక్షణమే స్పందించి ఆర్ధిక శాఖ నుంచి రావాల్సిన రీవైజ్డ్ ఎస్టిమేషన్ కు అనుమతులిస్తే పోలవరం నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతోందని ఆశభావం వ్యక్తం చేస్తున్నారు ఎంపీలు. ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయంలో కూడా నిన్న ఎంపీ విజయసాయి రెడ్డి స్పీకర్ కు విన్నవించిన సంగతి  విధితమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: