హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు రోజురోజుకీ హాట్ హాట్ గా మారిపోతున్నాయి. టిఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్  ఏకంగా టిఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి బీజేపీలో చేరారు   అంతేకాకుండా ఏకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు.  దీంతో అటు బీజేపీకి ఇటు టీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ ఉప ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. కాగా హుజరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎవరికి వారు తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా  పావులు కదుపుతున్నారు.



 ఇంకా హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ను విడుదల కాలేదు.. అప్పుడే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కీలక నేతలు అందరూ హుజూరాబాద్ నియోజకవర్గం లో వాలిపోతున్నారు. ఈ క్రమంలోనే అటు అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నో హామీల వర్షం కురిపిస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ ఇక పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇక ఇటీవల పాదయాత్రలో భాగంగా కెసిఆర్ ఉద్దేశిస్తూ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్త ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.



 సీఎం కేసీఆర్ అహంకారం నిరంకుశత్వం వల్లే ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి అంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. నేను టిఆర్ఎస్ పార్టీ వల్లనే హుజురాబాద్లో గెలిచానని దమ్ముంటే రాజీనామా చేయాలి అని కెసిఆర్ బానిసలు అన్నారు.. అందుకే రాజీనామా చేసి సవాల్ విసిరా అంటూ ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు. ఈటల రాజేందర్ అంటే కేవలం గడ్డిపోచ మాత్రమే అని అనుకున్నారు.. కానీ ఇప్పుడు గడ్డపార లేక తయారయ్యా అంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఇక కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం కేసీఆర్ తీసుకు వచ్చిన దళిత బందు కార్యక్రమాన్ని మేధావులు ఎవరూ నమ్మడం లేదు అంటూ వ్యాఖ్యానించారు ఈటెల రాజేందర్.

మరింత సమాచారం తెలుసుకోండి: