ఈ మధ్య కొత్తగా విడుదలైన శాటిలైట్ ఫొటోస్ ను పరిశీలిస్తే  మళ్ళీ చైనా ఆ శాటిలైట్ కు సంబందించి రెండో ఫీల్డ్‌ను రెడీ చేయ బోతున్నట్లు తెలుస్తుంది.అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా చైనా సరికొత్తగా న్యూక్లియర్ ఆయుధాలను తయారుచేసే పనిలో పడిందని ఈ సర్వే లో తెలిసింది.మట్ కొర్దా, హ్యాన్స్ క్రిస్టిన్సెన్ అనే ఇద్దరు పరిశోధకులు  ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్తో కలిసి రాసిన ఒక స్టోరి సోమవారం పబ్లిష్ అయింది.దానిలో ఏముందో ఒకసారి పరిశీలిద్దాం.ఈ పరిశోధనలో భాగంగా వెస్టరన్ చైనాలోని జిన్ జియాంగ్ అనే ప్రాంతానికి 60 మైళ్ల దూరంలో ఒక కొత్త సిలో మైదానాన్ని రెడీ చేస్తున్నారు చైనా వాసులు.


అయితే ఇందులో ఉన్న మొత్తం గ్రిడ్ ను బట్టి చూస్తే దాదాపు 110 దాక సిలోలు ఉన్నట్లుగా తెలిసింది. అయితే అందులో కేవలం 14 సిలోలు మాత్రమే కన్‌స్ట్రక్షన్ సైట్ల నిమిత్తంల డోమ్ వంటి నిర్మాణం మొదలు పెట్టేసారు.అయితే రీసెర్చర్ల చేసిన రీసెర్చ్ ఫలితంగా మరో 19 సిలోలు కూడా తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నారని విషయం తెలుస్తుంది.అయితే ఇక్కడ మనం మరో విషయాన్ని గమనించాలి. అది ఏంటంటే చైనీస్ నగరంలోని యెమన్ అనే ప్రాంతంలో 119 కొత్త మిస్సైల్ సిలోల నిర్మాణం జరుగుతుందని బయట ప్రపంచానికి తెలిసిన కొద్ది వారాల్లోనే కొత్తగా వీటి నిర్మాణం కూడా మొదలు పెట్టడం గమనార్హం. అయితే పరిశోధకులు చెప్పే విధానం బట్టి చూస్తే కేవలం అంతర్జాతీయ స్థాయిలో చైనా గుర్తింపు రెట్టింపు అవ్వాలనే క్రమంలో నే  మళ్ళీ 250 కొత్త సిలోల ఏర్పాటు చర్యను చేపట్టిందని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ ఈ కధనంలో వెల్లడించారు. మరి ఇది ఎక్కడకి దారి తీస్తుందని అనే విషయాలపై అన్నీ దేశాలు ఆలోచనలో పడ్డాయి. చైనా ఇలా కొత్తగా సిలోల నిర్మాణం చేపట్టడం ఇదే మొదటిసారి. 




మరింత సమాచారం తెలుసుకోండి: