దీంతో అటు వాహనదారులు ప్రస్తుతం ట్రాఫిక్ చలానాల నుంచి ఎంత తప్పించుకోవాలని ప్రయత్నించినప్పటికీ ట్రాఫిక్ జరిమానాలు ఇంటికి వస్తూ ఉండటం గమనార్హం. దీంతో వాహనదారుల జేబుకు చిల్లు పడుతుంది. అయితే ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ట్రాఫిక్ చలానాలు కూడా ఎక్కువగా ఉండటం గమనార్హం. దీంతో వాహనదారులు ప్రస్తుతం రోడ్డు నిబంధనలు ఉల్లంఘించాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు ఏదో ఒక విధంగా ఇక ట్రాఫిక్ చలానాలా నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు
కానీ వాహనదారులు గుర్తుపెట్టుకోండి.. ఇకనుంచి ఇలాంటివి అస్సలు కుదరదు. ఎంత తప్పించుకోవాలని ప్రయత్నించినా జరిమానా మాత్రం తప్పదు. ఎందుకంటే ట్రాఫిక్ చలానాల జారీకి తెలుగు రాష్ట్రాలలో ఇక మరికొన్ని రోజుల్లో ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ పరికరాలు రాబోతున్నాయి. స్పీడ్ కెమెరా, సీసీటీవీ, స్పీడ్ గన్, బాడీ వేరబుల్ కెమెరా, డాష్ బోర్డు కెమెరా, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్, వేయింగ్ మిషన్ లను రహదారులపై ఏర్పాటు చేయాలని ఇటీవల కేంద్ర రహదారి రవాణా శాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 జిల్లా కేంద్రాలు ఇక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నల్గొండ సంగారెడ్డి పటాన్చెరు లలో ఇక ఈ అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి