ప్రముఖ బాలీవుడ్ న‌డుడు సోనూసూద్ ఇంట్లో వ‌రుస‌గా మూడు రోజుల నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. సెప్టెంబర్ 15 న ముంబైలో ని సోనూ కు సంబంధించిన‌ ఆరు ప్రదేశాలలో ఐటి అధికారులు సోదాలు చేశారు. మరుసటి రోజు, వారు మళ్లీ అతని నివాసానికి చేరుకున్నారు. అలాగే వ‌రుస‌గా మూడో రోజైన (సెప్టెంబర్ 17) నేడు ముంబై, మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌, జైపూర్ తో పాటు ఇత‌ర ప్రాంతాల్లోని ఆస్తుల‌పై ఏక కాలంలో విచార‌ణ చేప‌ట్టారు ఐటీ అధికారులు.


     సెప్టెంబ‌ర్ 15న ముంబైలోని సోనూసూద్‌కు సంబంధించిన ఆరు ప్రాంతాల్లో సోదాల‌ను  ఐటీ  అధికారులు ప్రారంభించిన‌ట్టు తెలిసిందే. బాలీవుడ్‌ నుంచి తీసుకున్న పేమెంట్లు, సోనూ వ్యక్తిగత ఆదాయంలో పన్ను ఎగవేతను గుర్తించినట్లు స‌మాచారం. సూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులపై ఐటీ అధికారులు ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించేందు ఛాన్సుంది.
 

     బుధ‌వారం నిర్వ‌హించిన సోదాల‌కు సంబంధించి ‘‘లఖ్‌నవూలోని ఓ స్థిరాస్తి సంస్థతో సూద్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడ‌ని దీనికి సంబంధించి పన్ను ఎగవేత అనుమానాలు ఉండ‌డం వ‌ల్లే ఈ దాడులు చేప‌ట్టామ‌ని ఓ ఐటీ అధికారి వెల్ల‌డించారు. ఇదే క్ర‌మంలో గురువారం (నిన్న‌) మ‌రోసారి సోనూ నివాసానికి వెళ్లిన అధికారులు సోదాలు నిర్వ‌హించారు.  ఈ సందర్భంగా స్థిరాస్తి సంస్థతో ఒప్పందం గురించి అధికారులు ప్రశ్నించినట్లు విశ్వ‌స‌నీయ సమాచారం.


ఇటీవల ఢిల్లీ ‘ఆప్‌’ ప్రభుత్వం ప్రారంభించిన ఓ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు సోనూసూద్‌ సీఎం కేజ్రీవాల్‌ను కూడా కలిశారు. ఈ నేపథ్యంలో తాజా ఐటీ సోదాలు ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. సోనూ నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాయి ప్రతిపక్షాలు. కొవిడ్‌ వేళ వలస కూలీలతో పాటు ఎంతోమందికి సాయం చేసిన మ‌హానుభావుడిపై క‌క్ష్య‌పూరితంగా ఈ దాడులు చేస్తున్నారని వారు ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: