ఈ మధ్యకాలంలో ఎంతోమంది కుక్కలు పెంచుకోడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అన్నది అందరికి తెలిసిందే.  ఈ క్రమంలోనే ఏకంగా మనుషులకంటే కుక్కల పైన ఎక్కువగా ప్రేమ చూపిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.  రోడ్డు మీద ఉండే వారికి ఒక్క రూపాయి కూడా దానం చేయరు కానీ ఇష్టమైన కుక్కను కొనుగోలు చేయడానికి మాత్రం లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడటం లేదు నేటి రోజుల్లో. ఇలా చాలామంది కుక్కలకు ఇచ్చిన విలువ మనుషులకి ఇవ్వడం లేదు.  అయితే మనుషులు పక్కన లేకపోయినా పర్వాలేదు కానీ ఇక ఇష్టమైన కుక్క పక్కన లేదు అంటే చాలు ఏదో కోల్పోయినట్లుగా ఫీలవుతున్నారు నేటి రోజులలో జనాలు. ఇలా రోజురోజుకీ కుక్కలు పెంచుకునే వారి సంఖ్య పెరిగిపోవడమే కాదు ఇక ఆ కుక్కల పై అమితమైన ప్రేమ పెంచుకునే వారికి సంఖ్య కూడా ఎంతగానో పెరిగిపోతుంది.  అయితే ఎంతో మంది డాగ్ లవర్స్ అటు కుక్కల సౌకర్యం కోసం వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేశాడు.  సాధారణంగా ఇప్పటివరకు ప్రియమైన వారితో కలిసి గడిపేందుకు భారీగా ఖర్చు చేసి అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవడం చేస్తూ ఉంటారు చాలా మంది.  కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఏకంగా కుక్కతో ప్రశాంతంగా గడిపేందుకు ఏకంగా లక్షల రూపాయలు ఖర్చు చేసాడు. ఏకంగా పెంపుడు కుక్క కోసం విమానం బుక్ చేసాడు ఇక్కడ ఒక యజమాని. ఇటీవలే ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్ క్యాబినెట్ మొత్తం బుక్ చేసుకున్నాడు. ముంబై నుంచి చెన్నై వెల్లెందుకు గాను ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఏకంగా క్లాస్ క్యాబిన్లో 12 సీట్లను ఒకే వ్యక్తి బుక్ చేసుకున్నాడు. అయితే ఈ ఒక్క సీటు ధర రూ 20 వేల రూపాయలు కావడం గమనార్హం. అయినప్పటికీ డబ్బుల గురించి ఆలోచించని సదరు వ్యాపారవేత్త తన పెంపుడు కుక్క తో ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా ప్రశాంతంగా ప్రయాణించేందుకు ఇలా 12 సీట్లు బుక్ చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: