పంజాబ్ రాజ‌కీయాలు రోజు రోజు కు మ‌లుపు తిప్పుకుంటున్నాయి. కెప్ట‌న్ అమ‌రీంద‌ర్ సింగ్ కు పంజాబ్ పీసీసీ చీఫ్ కు మ‌ధ్య విబేదాలు రావ‌డంతో కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ త‌న ప‌ద‌వి రాజీనామా చేశారు. దీంతో పంజాబ్ లో రాజ‌కీయ అనిశ్చి తి నెల‌కొంది. శ‌నివారం అమ‌రీంద‌ర్ సింగ్ రాజీనామా చేసినా వెంట‌నే పీసీసీ చీఫ్ న‌వ‌జ్యోత్ సిద్దూ సీఎల్ పీ స‌మావేశానికి పిలుపు నిచ్చాడు. అయితే త‌న‌కు తెలియ‌కుంట‌నే పంజాబ్ కాంగ్రెస్ చాలా జ‌రుగుతున్నాయ‌ని అమ‌రీంద‌ర్ సింగ్ ఆరోపించారు. పీసీసీ చీఫ్ న‌వ‌జ్యోత్ సిద్దూ త‌న‌కు అవ‌మానించేలా వ్య‌వ‌హిరించాడాని అమ‌రీంద‌ర్ సింగ్ రాజీనామా త‌ర్వాత చెప్పాడు.


ఇదిలా ఉండ‌గా కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ రాజీనామాతో పంజాబ్ రాష్ట్ర ముఖ్య మంత్రి గా ఎవ‌రి ని చేయాల‌ని ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద త‌ల నొప్పి లా మారింది. సునీల్ జాఖ‌ర్‌, బియాంత్ సింగ్ మ‌న‌రవ‌డు ఎంపీ ర‌వ‌నీత్ సింగ్ బిట్టూల‌తో పాటు పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ ప్ర‌తాప్ సింగ్ బ‌జ్వా ల‌లో ఒక‌రిని ముఖ్య మంత్రి గా ఎన్నుకుంటార‌ని ఉహాగ‌ణాలు వ‌చ్చాయి. కానీ అనుహ్యంగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గాంధీ కుటుంబానికి ద‌గ్గిరి వ్య‌క్తి అంబికా సోని పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. అంబికా సోని ని ముఖ్య‌మంత్రి చేయాల‌ని సోనియా గాంధీ కూడా భావించార‌ట‌.



ఈ విష‌యం పై అంబికా సోని స్పందించారు. కాంగ్రెస్ అధిష్టానం న‌న్ను సీఎం ఉండాల‌ని కోరింది నిజ‌మే అని చెప్పింది. అయితే దానికి అంబికా సోని సున్నితంగా తిర‌స్క‌రించార‌ని తెలిపింది. పంజాబ్ రాష్ట్రానికి కేవ‌లం సిక్కు లే ముఖ్య మంత్రి కావాల‌ని ఆమె అంది. ఆదివారం అనగ నేడు పంజాబ్ కాంగ్రెస్ క‌మీటి బేటీ కాబోతుంది. ఈ స‌మావేశంలో త‌ర్వాతి సీఎం ఎవ‌రా అనేది తేల‌నుంది. ఈ స‌మావేశానికి పంజాబ్ వ్య‌వ‌హారాల కాంగ్రెస్ ఇన్ ఛార్జి హ‌రీశ్ రావ‌త్‌, కేంద్క‌ర పార్టీ ప‌రిశీల‌కులు అజ‌య్ మాకెన్, హ‌రీశ్ చౌద‌రి హ‌జ‌ర‌వుతున్నారు. ఆదివారం సాయంత్రం వ‌ర‌కు సీఎం పేరును ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: