పంజాబ్ కాంగ్రెస్ నూత‌న సీఎంగా సుఖ్జీందర్ సింగ్ రాంధవా పేరును ఆ పార్టీ అధిష్టానం ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బ‌న్వ‌రీ లాల్ పురోహిత్‌ అపాయింట్‌మెంట్ కోసం సుఖ్జింద‌ర్ సింగ్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని మీడియాలో ప్ర‌చారం సాగ‌డంతో ఈ ఊహాగానాల‌కు బ‌లం చేకూరుతోంది. కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యేల‌తో చ‌ర్చించి అంద‌రి ఆమోదం తీసుకున్నారని, దీనిపై కాసేప‌ట్లో అధికార ప్ర‌క‌ట‌న రాబోతుంద‌నే అనుకున్న స‌మ‌యంలో ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ అపాయింట్ మెంట్ కోర‌డంతో పంజాబ్ రాజ‌కీయాలు ఉత్కంఠగా మారాయి. ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో ఆ పార్టీ ఎంపీ అంభిగా సోని ఈ విష‌యంపై చ‌ర్చించిన‌ట్టు పార్టి వ‌ర్గాలు వెల్ల‌డించాయి.


   ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచారు సుఖ్‌జిత్‌సింగ్ రంధావా. డేరాబాబా నాన‌క్ స్థానం నుంచి ప్రాతినిద్యం వ‌హిస్తున్నాడు ఆయ‌న‌. మాజీ ముఖ్యమంత్రి  మంత్రివ‌ర్గంలో జైళ్లు, స‌హ‌కారా శాఖ మంత్రి గా బాధ్య‌తలు నిర్వ‌హించారు. అయితే త‌నే సీఎం గా ఎలాంటి స‌మాచారం అంద‌లేద‌ని తెలిపిన రంధావా గ‌వ‌ర్న‌ర్ అపాయింట్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ని ప్ర‌చారంతో మ‌రింత ఆస‌క్తి నెల‌కొంది.


  అయితే, పంజాబ్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అధికార పోరు మధ్య, కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించిన తర్వాత విలేకరులతో మాట్లాడిన అమరీందర్ సింగ్, పార్టీ హైకమాండ్ చర్యల ఫలితంగా తాను 'అవమానానికి గురయ్యాను' అని ఆవేద‌న చెందాడు.  


తన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్నకు కూడా ఆయన స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎవరిని నమ్ముతుందో వారే అవుతార‌ని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించే అవకాశం ఉండ‌డంతో త‌రువాతి సీఎం సుఖ్‌జిత్‌సింగ్ రంధావా నే  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింద‌ని పార్టీ వ‌ర్గాలతో పాటు మీడియాలో  జోరుగా ప్ర‌చారం సాగ‌డంతో ప్రాధాన్యత  సంచ‌రించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: