ఆంధ్ర ప్రదేశ్ ప్ర‌భుత్వానికి ఇటీవ‌ల వ‌రుస షాకులు త‌గులుతున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ఏపి సర్కార్  కి మ‌రో అదిరిపోయే షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే అటు కోర్టుల‌తో పాటు మ‌రో వైపు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అనేక కొర్రీలు ప‌డుతున్నాయి. మ‌రో వైపు కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా అప్పులు చేయ‌రాద‌ని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇన్ని స‌మ‌స్య‌ల‌తో జ‌గ‌న్ స‌ర్కార్ స‌త‌మ‌త మ‌వుతోన్న వేళ మ‌రో షాక్ త‌గిలింది. అంత‌ర్జాతీయ ఆర్థిక సంస్థ‌ల నిధుల‌తో న‌డిచే ప్రాజెక్టుల‌కు ఏపీలో ఇక ఆర్థిక సాయం బంద్ కానుంది. ఈ ప్రాజెక్టుల కింద విడుద‌ల చేసిన రూ.960కోట్లకు లెక్క‌లు చెప్పాల‌ని డిపార్ట్‌మెంట్ ఎకాన‌మిక్ అఫైర్స్ నుంచి జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి.

డిపార్ట్మెంట్ ఎకానమిక్ అఫైర్స్ రాసిన లేఖ‌పై కేంద్ర ఆర్థిక శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ క్ర‌మంలోనే గ‌త వారం కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఏపీ ప్ర‌భుత్వానికి ఘాటు లేఖ వ‌చ్చింది. ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా వ‌స్తున్న నిధుల‌ను వేరే ప‌థ‌కాల‌కు మ‌ళ్లించ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ప్ర‌భుత్వ తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. రూ.960కోట్ల‌కు లెక్క‌లు చెప్ప‌కపోతే భ‌విష్య‌త్తులో నిధులు విడుద‌ల చేయ‌బోమ‌ని  అంత‌ర్జాతీయ ఆర్థిక సంస్థ‌లు తేల్చి చెప్పాయి.

ఈ ప్రాజెక్టుల కింద చేప‌ట్టిన ప‌నుల‌కు త‌మ‌కు బిల్లులు ఇవ్వ‌డం లేద‌ని అంత‌ర్జాతీయ ఆర్థిక సంస్థ‌ల‌కు కాంట్రాక్ట‌ర్లు ఫిర్యాదు చేశార‌ట‌. ఆ మాట‌కు వ‌స్తే ఏపీలో ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో ఏ ప‌నులు చేప‌ట్టేందుకు కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావ‌డం లేదు. ఇక  కాంట్రాక్ట‌ర్ల ఫిర్యాదుతో తీవ్రంగా స్పందించిన అంత‌ర్జాతీయ ఆర్థిక సంస్థ‌లు కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాశాయి. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన కేంద్ర ఆర్తిక శాఖ వారం రోజుల్లో వివ‌ర‌ణ కావాల‌ని ఏపీ ఆర్థిక శాఖ ఉన్న‌తాధికారుల‌కు లేఖ రాసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: