అంతేకాకుండా ఉద్దానం ప్రాంతంలో సాయిరాజు తనదైన సేవా కార్యక్రమాలు చేస్తూ, ప్రజా మన్ననలు అందుకుంటున్నారు. కరోనా సమయంలో రెండు అంబులెన్సులు కొనుగోలు చేసి కలెక్టర్ కు అందించారు. ఇవే కాకుండా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తు లకు ఏ సాయం కావాలన్నా అందరికీ అందుబాటులో ఉంటూ వీలున్నంత వరకూ ప్రభుత్వం తరఫున కానీ తన తరఫున కానీ బాధితులకు చేయూత అందిస్తున్నారు. నిన్న మొన్నటి వేళ ఆయనకు డీసీఎంఎస్ పదవి వరించింది. వాస్తవానికి 2019 సార్వ త్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోవడంతో జగన్ తనదైన సానుభూతి చూపి, నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఇది కూ డా గడువు తీరిపోయింది. ఈ నేపథ్యంలోనే పిరియా విజయ కవిటి జెడ్పీటీసీగా ఎన్నిక కావడంతో ఆమెకే జెడ్పీ పీఠం అని ఫిక్స్ అయిపోయా రు. పార్టీ కూడా ఆమె వైపే మొగ్గు చూపింది. ఈ దశలో మరో కొత్త డిమాండ్ ఒకటి తెరపైకి వచ్చింది.
అదేంటంటే..
తూర్పు కాపులకు జెడ్పీ పీఠం ఇవ్వాలని కోరుతూ ఆ సంఘం ప్రతినిధులు నిన్నటి వేళ మీడియా మీట్ ను నిర్వహించారు. రా జకీయంగా తమకు ప్రాధాన్యం తగ్గిపోతుందని, ఈ తరుణంలోనే తమకు పదవి ఇవ్వాలని కోరుతూ..జగన్ కు కొన్ని సూచనలు
చేశారు. అయితే జెడ్పీ పీఠం ఎవరికి అన్నది ఇప్పటికే నిర్ణయం అయిపోయినందున కొత్తగా ఎవ్వరు ఏ డిమాండ్ తెచ్చినా అదేమీ అమలుకు నోచుకోదని వైసీపీ అంటోంది. కానీ గతంలో తమ సామాజిక వర్గం తరఫున పాలవలస రాజశేఖరం జెడ్పీ చైర్మన్ పదవి పొందారని, అదేవిధంగా ఈ సారి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు. మరో వైపు యాదవ సామాజిక వర్గం కూడా తమకూ ఈ సారి ఓ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం డిమాండ్లు ఎలా ఉన్నా పిరియా విజయ (బలిజ సామాజికవర్గం) అభ్యర్థిత్వంను బలపరచడం మినహా జెడ్పీటీసీలకు మరో దారే లేదు. ఇప్పటికే అధిష్టానం ఆమె అభ్యర్థిత్వంపై లైన్ క్లియర్ చేసింది కూడా! ఇక ఎన్నిక ఒక్కటే తరువాయి. ఈ ప్రక్రియ కూడా రేపటి వేళ లాంఛన ప్రాయమే!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి