టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం ముగియకముందే ఏపీ డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు సంచలనం అయింది. ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి బయటకు వచ్చేది ఎవరు అనే దానిపై అందరిలో ఒక ఆసక్తి ఉంది. ఏపీ డ్రగ్స్ మీద పోలీసులు కూడా సీరియస్ గా ఫోకస్ చేసారు. ఎవరు ఉన్నా సరే వదిలే ప్రసక్తి లేదని అంటున్నారు. గుజరాత్ నుంచి కాకినాడ తీరానికి వస్తున్న డ్రగ్స్ మీద ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఫోకస్ పెట్టాయి. ఒక వ్యక్తిని చెన్నై తీసుకువెళ్ళి విచారిస్తున్నాయి. ఇక దీనిపై ఏపీ పోలీసుల మీద విమర్శలు రావడంతో డిజిపి గౌతమ్ సవాంగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

హెరాయిన్ విషయంలో ఏపీ పాత్ర ఉందని దుష్ప్రచారం జరుగుతుంది అని డీజీపీ ఫైర్ అయ్యారు. పట్టుబడిన హెరాయిన్ కు ఏపీకి ఎటువంటి సంబంధం లేదు అని అన్నారు ఆయన. డిఆర్ఐ నార్కోటెక్స్ కంట్రోల్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది అని తెలిపారు. విజయవాడను ట్రాన్స్పోర్ట్ అడ్రస్ గా మాత్రమే వాడుకున్నారు అని వెల్లడించారు. చెన్నై కేంద్రంగా మొత్తం లావాదేవీలు జరిపారు అని అన్నారు ఆయన. హెరాయిన్ విషయంలో పొలిటికల్ లీడర్స్ అంతా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని విమర్శించారు.

సీఎం ఆఫీసు పక్కన ఇదంతా జరిగిందని అసత్య ప్రచారం చేస్తున్నారూ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదారి పట్టించి అభద్రతా భావంలోకి  పొలిటికల్ లీడర్స్ నెడుతున్నారు అని వ్యాఖ్యలు చేసారు. పొలిటికల్ లీడర్స్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా అన్నారు ఆయన. హెరాయిన్ పట్టుబడిన  విషయంలో వాస్తవాలు తెలుసుకొని పొలిటికల్ లీడర్స్ మాట్లాడాలి అని హితవు పలుకారు. అసాంఘిక కార్యకలాపాలకు రాష్ట్రంలో చోటు లేదు అని డీజీపీ సవాంగ్ స్పష్టం చేసారు. హెరాయిన్  కేసు దర్యాప్తు కేంద్ర బృందాలు విచారణ చేస్తున్నాయి అని ఆయన పేర్కొన్నారు. దర్యాప్తు బృందాలకు మేము సహకరిస్తాం అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap