బీఏసీ సమావేశానికి బీజేపీని ఎందుకు ఆహ్వానించడంలేదో చెప్పాలని ప్రశ్నించారు బిజేపి ఎమ్యెల్యే  రఘనందనరావు.  మజ్లీస్ పార్టీ నేతలు చెప్పిన నాటి నుండి స్పీకర్ బీఏసీ కి తమను ఆహ్వానించడం లేదని..  మొదటి ప్రభుత్వం లో బీజేపీ ఆహ్వానించిన స్పీకర్ ఇప్పుడు ఎందుకు ఆహ్వానించడం లేదని అడుగుతే స్పీకర్ వద్ద సరైన సమాధానం లేదని నిప్పులు చెరిగారు ఎమ్యెల్యే  రఘనందనరావు. ఎమ్మెల్యేలు తక్కువగా ఉంటే బీఏసీ కి ఆహ్వానించవద్దని ఎక్కడ నిబంధన ఉందొ చెప్పాలని..  ఐదుగురు సభ్యులు  ఉంటేనే బీఏసీ ఆహ్వానించాలనే నిబంధన ఎక్కడ ఉందో చెప్పాలని నిలదీశారు.
 
దీని పై  నిరసన తెలియ జేస్తామని పేర్కొన్నారు. సోమవారం రోజు ఉదయం 9 గంటల నుండి పది గంటల వరకు అసెంబ్లీలోని  గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తామన్నారు ఎమ్యెల్యే  రఘనందనరావు. గతంలో అమలు పరిచిన విధానాలను కేసీఆర్  ప్రభుత్వం అమలు చేయాలని.. సీఎం కేసీఆర్ సొంత రాజ్యాంగాన్ని ... అతి ఉత్సహంతో, కొత్త విధానాలు అమలు చేస్తే భవిష్యత్తులో  టిడిపి పట్టిన గతే టీఆరెస్ పడుతుందని హెచ్చరించారు.  సీఎల్పీని   టీఆరెస్ విలీనం చేసుకున్నప్పుడు బట్టి విక్రమార్కను బీఏసీ ని ఎలా ఆహ్వానిస్తున్నారో  ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

ఎందుకు బీజేపీ సభ్యులను బిఎసికి ఆహ్వానించడం లేదని బట్టి ప్రశ్నించడం లేదని.. కాంగ్రెస్ , టీఆరెస్ ఒక్కటే అని ఇప్పటి కైనా బట్టబయలు అయిందని పేర్కొన్నారు.  అసలు కాంగ్రెస్ విలీనం అయింది.. మిగిలిన కాంగ్రెస్ పార్టీ టీఆరెస్ కు బి టీం గా మారిందని చురకలు అంటించారు.  అందుకే భట్టి... బీజేపీ సభ్యులను పిలవక వకపోయిన సైలెంట్ గా ఉంటున్నారని.. స్పీకర్ నిర్ణయానికి వ్యతి రేకంగా బీజేపీ పార్టీ నిరసన తెలియజేస్తుందన్నారు.  సభ స్పీకర్ అదుపులో నడుస్తున్నట్టు కనిపించడంలేదు.. బాధాకరమని.. అందుకే స్పీకర్ సరైన సమాదనం చెప్పలేకపోతున్నట్టు కనిపిస్తుందని వెల్లడించారు ఎమ్యెల్యే  రఘనందనరావు. స్పీకర్ సీఎం కేసీఆర్ కనుసన్నల్లో  నడుస్తున్నారనే అపవావదును  మూటగట్టుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. .


మరింత సమాచారం తెలుసుకోండి: