సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ స్టేట్ పాలిటిక్స్ లో హాట్  టాపిక్ గా మారింది.రెండు వారాల గ్యాప్ లో రెండోసారి హస్తినాలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి. గతంలో కీలక సమావేశాలకు పిలిచినా వెళ్ళని కేసీఆర్ ఇప్పుడు వరుస పెట్టి మరీ టూర్లు వెళ్తున్నారు. ఇక బిజెపి పెద్దలను కలుస్తుండడం పొలిటికల్ సర్కస్ లో చర్చకు దారి తీసింది. భవిష్యత్ రాజకీయ వ్యూహాలతోనే సీఎం టూర్లు అని ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్ మరోసారి హస్తినా లో పర్యటిస్తున్నారు. ఇటీవలే తొమ్మిది రోజుల కిందట ఢిల్లీలో ఉండి వచ్చిన ఆయన ఇప్పుడు మరో మూడు రోజుల పర్యటనకు వెళ్లారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక  టిఆర్ఎస్ లీడర్లకు నాలుగు నెలలుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎన్ని చేసినా అక్కడ గెలిచే పరిస్థితి లేదని టిఆర్ఎస్ లీడర్ లు ఆందోళన చెందుతున్నారు. ఈ టైంలో ఓటర్లను గందరగోళ పరిచేందుకు కెసిఆర్ ఢిల్లీలో బిజెపి అగ్రనేతలతో బేటీ అవుతున్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుస ఢిల్లీ టూర్ లతో బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే తప్పుడు ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లాలని చూస్తున్నారని రాష్ట్ర బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ఎస్ నేతలు మాత్రం కేసీఆర్ టూర్ లో ఎలాంటి రాజకీయం లేదంటున్నారు. ఈ నెల 1న ఢిల్లీకి వెళ్లిన సీఎం తొమ్మిది రోజులు అక్కడే ఉన్నారు. ప్రధాని మోడీ తో పాటు, అమిత్ షా,  పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. నిన్న మరోసారి హస్తినా వెళ్లిన సీఎం కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, పీయూష్ గోయల్ ను కలవనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆధ్వర్యంలో జరిగే మీటింగ్ కు హాజరుకానున్నారు. ఒకటికి రెండు సార్లు బిజెపి అగ్రనేతల తో బేటీ అవడంతో తనకు పైస్థాయిలో దోస్తానా ఉందని, కేంద్రంతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని జనంలో ప్రచారం చేసుకోవాలని బీజేపీ నేతలు అంటున్నారు.

 మరోవైపు రాబోయే ఎన్నికలకు కెసిఆర్ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాడని, ఎప్పుడు అవకాశం దొరికినా కేటీఆర్ ను సీఎం చేసే ఆలోచన లో ఆయన ఉన్నట్లు టిఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. కేటీఆర్ కాబోయే సీఎం అనే వాదనలు ఇప్పటికే చాలాసార్లు కెసిఆర్ వినిపించిన, తనకు ఢిల్లీలో ప్రాతినిధ్యం దొరికితే కేటీఆర్ కు రాష్ట్ర పగ్గాలు అప్పజెప్తారనే  ప్రచారం జరుగుతుంది. కెసిఆర్ ఢిల్లీ పర్యటన వెనుక రాజకీయం ఏమి లేదని రాష్ట్రాల మధ్య ఉండే అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీకి వెళుతున్నారని గులాబీ నేతలు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: