తెలుగు దేశం పార్టీ(టీడీపీ) ఆవిర్భావం అప్పటి విలువలు ఇప్పుడు లేవనే సంగతి అందరికి తెలిసిందే. అయినా విలువలు లేని రాజకీయాలలో అవి కోరుకోవడం నిజంగా తప్పేమో అన్నట్టు అలాంటివి లేని వారే ఇక్కడ బాగా మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఎక్కడో కొందరు మాత్రం ప్రజాసేవా భావంతో మాత్రమే రాజకీయాలలోకి వస్తుండటం అరుదుగా చూస్తుంటాం. అప్పుడెప్పుడో ఎన్టీఆర్, ఇప్పుడు జగన్ లాంటి వాళ్ళని అరుదుగానే చూడగలం అంటున్నారు విశ్లేషకులు. వారి పాలన అలా ఉంటుంది. ప్రజలు సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకొని దానికి అనుకూలంగా పరిపాలనలో మార్పులు చేసుకుంటూ ఎప్పుడు ప్రజారంజకంగా పాలించడం వారి లక్ష్యం, లక్షణం కూడా. వీటిని నీతి రాజకీయాలు అంటారు.

కేవలం వాడుకొని వదిలేసే తరహా రాజకీయాలే ఇక్కడ ఎక్కువ ఉండటం ఆశ్చర్యం ఏమి కాదు. ఎందుకంటే రాజకీయాలు అంటేనే అందరికి ఉన్న అభిప్రాయం అది. ఇందులో ప్రస్తుత టీడీపీ నాయకత్వం సిద్దహస్తులు. ఎవరు కాస్త మంచి ఆలోచనలతో ప్రజాక్షేత్రంలోకి రావాలని అనుకుంటున్నారో గమనించడం వారికి కులం లాంటి వాటి గురించి మాంచి బ్రెయిన్ వాష్ చేసి, తక్షణమే వాళ్ళను తమలో కలిపేసుకుంటారు. ఈ విషయంలో బాబు టీం కు పెట్టింది పేరు. అదే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తో జనంలోకి రావాలి అనుకున్నప్పుడు టీడీపీ టీం చేసిన ప్రయోగం(చేతబడి, బాణామతి కంటే భయానకమైన ప్రయోగం అది). పవన్ రాక తమకు ఎంతైనా ఓటు చీలిక చేసి, గెలుపు అవకాశాలు తగ్గించే అవకాశం ఉన్నట్టు గ్రహించి వెంటనే పవన్ ని పిలిపించి బ్రెయిన్ వాష్ చేసేశారు. సీఎం పిలవడంతో తన విలువ పెరిగింది అనుకుంటూ అత్యుత్సాహంతో ఆయనా పరిగెత్తుకు వెళ్ళాడు, ఇరుక్కున్నాడు.

అంతటితో ఆగలేదు, ఎప్పుడు పవన్ టీడీపీ గురించి కాస్త నెగటివ్ గా ఆలోచించే అవకాశాలు ఉన్నాయని తేలుతుందో అప్పుడప్పుడు పిలిపించడం, మళ్ళీ ఒక సెషన్ బ్రెయిన్ వాష్ చేసి పంపడం జరిగింది. దీనితో ఆయన కూడా ఇన్ని సార్లు మాజీ సీఎం పిలవడం తో సంతోష పడి అసలు విషయం మరిచి సెషన్ అయిపోయాక ఇచ్చిన టీ లేదా కాఫీ సేవించి వచ్చేస్తున్నాడు. మళ్ళీ కొన్నాళ్ళకు మీడియా లో టీడీపీ గురించి ఏదైనా చేదు వార్త చూడగానే బ్రెయిన్ ఆక్టివ్ అయిన పవన్ ను టీడీపీ మళ్ళీ ఇంకో సెషన్ కు పిలిపించుకుంటూ మొత్తానికి టీడీపీ కార్యాలయంలో కట్టేసిన కుక్కపిల్లల మాదిరి ఆయనను వాడుకుంటున్నారు. బాబొరికి వాడుకొని వదిలేసే అలవాటు తప్ప వదిలేసిన వాడి పరిస్థితి ఏమిటో.. అని ఆలోచించే అలవాటు లేదు అని పవన్ ఎప్పుడు తెలుసుకుంటాడో, ఇక తెలుసుకున్నా అనవసరం అనే స్థితికి పరిస్థితులు వచ్చేశాయి.  అంతటి ఎన్టీఆర్ ను కూడా చెప్పులతో కొట్టించిన ఘనత ఉన్నవాడికి ఈ పవన్ గొప్ప విషయమా ఏంటి అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: