ప్రముఖ హెటిరో ఫార్మా పై ఐటీ దాడులు ఇంకా  కొనసాగుతూనే ఉన్నాయి.  నిన్న ఉదయం నుండి హైదరాబాద్ విశాఖపట్నం గుంటూరు విజయవాడ  ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతూనే ఉన్నాయి.  నిన్న ఉదయం నుండి రాత్రి వరకు హేటి రో ల్యాబ్స్ పై ఆంటీ టాక్స్ ఎవాషన్ వింగ్ అధికారుల సోదాలు చేశారు.  మహమ్మారి కోవిడ్ 19 సమయం లో కంపెనీ జరిపిన లావా దేవీలు, ఐటీ రిటర్న్స్ పత్రాలను పరిశీలిస్తున్నారు ఐటీ అధికారులు.  హెటిరో డైరెక్టర్ల ఇళ్లలో ను ఈ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.  జొన్నల సంబి రెడ్డి, నరసింహారెడ్డి, బండి వంశీకృష్ణ, బండి పార్థసారథి రెడ్డి తో పాటు వారి పాట్నర్ ఇళ్లలో ను సోదాలు నిర్వహించారు  ఐటి అధికారులు.  

హైదరాబాద్ మహా నగరం సనత్ నగర్ హేటిరో హెడ్ ఆఫీస్ తో పాటు వైజాగ్ నక్కపల్లి మండలం  లో ఉన్న హెటిరో కార్యాలయం పైన కూడా ఐటి దాడులు జరిగాయి.  ఇటీవల హురాన్ ఇండియా ప్రకటించిన బిలినియర్ల లిస్ట్ లో హైదరాబాద్ నుండి రెండో స్థానం లో హెటిరో గ్రూప్ చైర్మన్ పార్థసారధి రెడ్డి నిలిచారు. అంతేకాదు.... దేశ వ్యాప్తం గా 58 వ అత్యoత  ధనికుడి గా పార్థ సారథి రెడ్డి నిలిచారు.

ఈ నేపథ్యం లోనే ఐటీ దాడులు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది.  కరోనా మహమ్మారి సమయం లో ఎలాంటి అవకతవకలకు పాల్పడ్డారా ? లేక.. ఇంకా ఎలాంటి వ్యాపారాలు చేస్తున్న దానిపై కూడా ఐటీ అధికారులు కన్నేస్తున్నారు.  ఏ ఒక్క సమాచారం వచ్చినా.. వదల కుండా అన్ని క్షున్నంగా దర్యాప్తు చేస్తున్నారు ఐటీ అధికారులు.  హెటిరో గ్రూప్ చైర్మ న్ పార్థసారధి రె డ్డి కు సంబంధించిన బంధు వుల ఇళ్లల్లోనూ... సోదాలు చే సే యోచన లో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: