ఏపీలో ఖాళీ గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల కు చంద్ర‌బాబు వ‌రుస‌గా ఇన్ చార్జ్‌ల‌ను ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్నారు. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో దాదాపు 35 చోట్ల పార్టీకి ఇన్ చార్జ్ లు లేకుండా పోయారు. గ‌త ఎన్నిక ల‌లో ఓడిపోయిన వారు కొంద‌రు పార్టీకి దూర‌మ‌య్యారు. మ‌రి కొంద‌రు పార్టీలో ఉన్నా నిస్తేజం గా ఉంటున్నారు. అస‌లు పార్టీ కార్య‌క్ర‌మాలు ఎంత మాత్రం ప‌ట్టించు కోవ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఖాళీ గా ఉన్న చోట్ల కీల‌క నేత‌ల‌కు ప‌గ్గాలు ఇస్తూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే గ‌త నాలుగు నెల‌లుగా చంద్ర‌బాబు క్ర‌మం త‌ప్ప‌కుండా ఈ ఇన్ చార్జ్ ల‌ను భ‌ర్తీ చేస్తూ వ‌స్తున్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా ఆరు నియోజకవర్గాలకు తెదేపా ఇంఛార్జ్లను చంద్ర‌బాబు ప్రకటించారు. ఉత్త‌రాంధ్ర లోని కీల‌క‌మైన విజయనగరం జిల్లా సాలూరు తెదేపా ఇంఛార్జ్గా గుమ్మడి సంధ్యారాణి ని ప్ర‌క‌టించారు. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు ఎమ్మెల్సీ గా ఉన్నారు. ఆమె ప్ర‌స్తుతం అర‌కు పార్ల‌మెంట రీ జిల్లా పార్టీ అధ్య‌క్షు రాలి గా కూడా ఉన్నారు. ఇక విశాఖ జిల్లా మాడుగుల తెదేపా ఇంఛార్జ్గా పీవీజీ కుమార్ ను ప్ర‌క‌టించారు. అక్క‌డ గ‌త రెండు  ఎన్నిక‌ల్లోనూ ఓడిపోతూ వ‌స్తోన్న మాజీ ఎమ్మెల్యే రామా నాయుడు ను త‌ప్పించేశారు.

ఇక ఎన్టీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన కృష్ణా జిల్లా పామర్రు తెదేపా ఇంఛార్జ్గా వర్లకుమార్ రాజా పేరును ప్ర‌క‌టించారు. ఇక ప్రకాశం జిల్లా దర్శి తెదేపా ఇంఛార్జ్గా పమిడి రమేష్ పేరు ఖ‌రారు అయ్యింది. ఈయ‌న గ‌తంలో తెలుగు యువ‌త జిల్లా అధ్య‌క్షుడిగా కూడా ప‌నిచేశారు. ఇక చిత్తూరు జిల్లా పుంగనూరు ఇంఛార్జ్గా చల్లా రామచంద్రా రెడ్డి ని ప్ర‌క‌టించారు. ఇక  పశ్చిమగోదావరి జిల్లా భీమవరం  ఇంఛార్జ్గా తోట సీతారామలక్ష్మీ ని ఖ‌రారు చేశారు. ఆమె మొన్న‌టి వ‌ర‌కు రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా ఉన్నారు. అలాగే న‌ర‌సాపురం పార్ల‌మెంట‌రీ జిల్లా పార్టీ అధ్య‌క్షు రాలి గా కూడా ఉన్నారు. ఇక చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెదేపా సమన్వయకర్తగా భీమినేని చిట్టిబాబు ను ప్ర‌క‌టించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: