ఇక సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడు అయ్యాక టీడీపీ నుంచి వచ్చిన నేతలకు ఆయన ప్రయారిటీ ఇవ్వడం లేదు. ఏ మాత్రం టీడీపీ సానుభూతి పరుడు అన్న ముద్ర ఉన్నా కూడా వీర్రాజు వాళ్లను పూర్తి గా దూరం పెట్టే స్తున్నారు. ఇక టీడీపీకి అనుకూలంగా మాట్లాడిన కొందరి నేతలను పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేయడంతోనే అప్పుడు చాలా మంది ఆయనపై రగిలి పోయారు. ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఏపీలో బీజేపీ స్టాండ్ ఎలా ? ఉండబోతోంది ? అన్నది ఆసక్తిగా మారింది.
ఇక ఇప్పుడు కూడా కొందరు టీడీపీ తో కలిసి వెళ్లాలని అనుకుంటున్నారు. వీర్రాజు వర్గం మాత్రం టీడీపీ తో కలిసి వెళితే ఏపీ లో బీజేపీ ఎదగదని.. ఇక్కడ సొంతంగా ఎదగాలంటే ఒంటరిగానే ఉండాలని భావిస్తున్నారు. అయితే టీడీపీ తో కలిసి వెళ్లాలని అనుకుంటోన్న వారు మాత్రం దీనిని వ్యతిరేకి స్తున్నారు. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలకు కూడా సుజనా చౌదరి, సీఎం రమేష్ లను ఆహ్వానించడం లేదని అంటున్నారు.
వీరు పార్టీని టీడీపీని దగ్గరకు చేర్చే ప్రయత్నాలే ఎక్కువగా చేస్తున్నారని పార్టీ అధినాయకత్వానికి కూడా వీర్రాజు పలు ఫిర్యాదులు చేస్తున్నారట. అయితే వీరిద్దరు వచ్చే ఎన్నికలకు ముందు టైం చూసుకుని బిగ్ బాంబ్ పేల్చేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి