తెలంగాణ లో వచ్చే ఎన్నికలలో పొత్తులకు సంబందించి వైయస్ షర్మిల ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పొత్తులు కీలకంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో షర్మిల ఆలోచన ఎలా ఉంది ఏంటి అనేది స్పష్టత రావడం లేదు. కొంతమంది కీలక నాయకులతో సమావేశం నిర్వహించిన సందర్భంగా తెలంగాణ ఉద్యమ నాయకులను అదే విధంగా గతంలో పనిచేసిన విద్యార్థి నాయకులను తనవైపుకు తిప్పుకునే విధంగా వ్యూహాలు సిద్ధం చేయాలని సూచించినట్లు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మరో పార్టీ కూడా పుట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఆ పార్టీతో షర్మిల ముందుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. నిరుద్యోగులతో కూడా షర్మిల ఈ మధ్య కాలంలో కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళతో కూడా కలిసి వెళ్లేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఉద్యమ సంఘాలను సీఎం కేసీఆర్ పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయలేదని దీంతో సీఎం కేసీఆర్ తీరుపై వాళ్ళు చాలా సీరియస్ గా  ఉన్నారు.

అందుకే వాళ్ళు ఇతర పార్టీల వైపు ఆసక్తి చూపిస్తున్నారని కూడా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని భావించిన్నా కాంగ్రెస్ పార్టీ పెద్దగా పోరాటం చేసే అవకాశం లేకపోవడంతో షర్మిల పార్టీ వైపు చూస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇక రాజకీయంగా తెలంగాణలో అన్ని విధాల అనుకూల పరిస్థితులు మార్చుకోవడానికి ప్రశాంత్ కిషోర్ తో కలిసి ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమ సంఘాల నాయకులతో ప్రశాంత్ కిషోర్ బృందం కూడా సమావేశమయ్యే అవకాశాలు ఉండవచ్చు అనే వార్తలు వినపడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు షర్మిలకు ఎంతవరకు కలిసి వస్తాయి అనే దానిపై ఒక అంచనా లేదు. భవిష్యత్తులో మాత్రం వీటిని అనుకూలంగా మార్చుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు అని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts