భారతీయ జనతా పార్టీకి.. సుదీర్ఘమైన చరిత్ర ఉంది. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా.. అనేక విధి విధానాలతో భారతీయ జనతా పార్టీ నడుస్తోంది. భారతీయ జనతా పార్టీలో... కష్టపడ్డ నాయకులకు ఉన్నత పదవులు వస్తాయి. అలాగే కుటుంబ పాలనకు భారతీయ జనతా పార్టీ పూర్తి వ్యతిరేకం. అయినప్పటికీ దేశంలోని కొంతమంది నాయకుల వారసులు.. రాజకీయాల్లోకి వస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే బండారు దత్తాత్రేయ... వారసురాలు, ఆయన ముద్దుల కూతురు విజయలక్ష్మి కూడా రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో... విజయలక్ష్మి పాల్గొంటోంది. అంతేకాదు ఇటీవల బండి సంజయ్ నిర్వహించిన.. ప్రజా సంగ్రామ యాత్ర లోనూ.. బండారు విజయలక్ష్మి... చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్నీ తానై.. ముందుండి నడిపించారు. 

ప్రతి ఏటా సికింద్రాబాద్ నియోజకవర్గంలో బండారు దత్తాత్రేయ గారు.. అలాయి.. బలాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతి దసరా సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు బండారు దత్తాత్రేయ. అయితే ఆయన ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలయ్ బలయ్ కార్యక్రమ లను అన్నీ తానై ముందుండి నడిపిస్తుంది విజయలక్ష్మి. దీంతో ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. అంతే కాదు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ అడిగే యోచనలో కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ప్రస్తుతం కిషన్ రెడ్డి ఆ స్థానంలో నిలవగా...  సికింద్రాబాద్ సీటు రావడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఒకవేళ దీనికి బీజేపీ అధిష్టానం ఒప్పుకోకపోతే చేవెళ్ల ఎంపీ స్థానం నుంచి పోటీచేసే యోచనలో విజయలక్ష్మి ఉన్నట్లు సమాచారం అందుతోంది. దానికి కూడా బిజెపి అధిష్టానం... నిరాకరిస్తే తే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగేందుకు విజయలక్ష్మి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి 2023 ఎన్నికల్లో సమయానికి...  రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు అన్ని వ్యూహాలు రచిస్తున్నారు బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి. అయితే వారసత్వ రాజకీయాలపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: