
దీంతో ఇది టీఆర్ఎస్ కు ఎంతో మైనస్ గా మారిపోయింది అని చెప్పాలి ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీకి ఇలాంటి ఒక షాక్ తగిల బోతుంది అన్నది అర్ధమవుతుంది. కాగా ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికను టిఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హుజురాబాద్ ఉప ఎన్నికలలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తుంది అధికార పార్టీ. ఈ క్రమంలోనే ఇక ఓటర్ మహాశయులకు ఆకట్టుకునేందుకు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది టిఆర్ఎస్ పార్టీ.
అయితే ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి గుర్తుల టెన్షన్ పట్టుకుంది. ప్రజా ఏక్తా పార్టీ తరపున అభ్యర్థిగా శ్రీకాంత్ ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. అయితే శ్రీకాంత్ కు రొట్టెల పీట గుర్తును కేటాయించారూ ఇది చూస్తే అచ్చంగా కారు గుర్తును పోలి ఉంటుంది. ఈ క్రమంలోనే పోలింగ్ జరిగే సమయంలో ఎంతో మంది ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యి టిఆర్ఎస్ కు బదులుగా ఈ గుర్తుకు ఓటు వేసే అవకాశం కూడా లేకపోలేదు. గతంలో దుబ్బాక ఎన్నికల్లో చపాతీ రోలర్ గుర్తు టిఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టినట్లు గానే ఇక ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కూడా రొట్టెల పీట గుర్తు టిఆర్ఎస్ను ఇబ్బంది పెట్ట బోతుందని అంటున్నారు విశ్లేషకులు.