తెలంగాణలో కాంగ్రెస్ ఎనిమిదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. 2014 నుంచి ఆ పార్టీ ఇక్క‌డ రోజు రోజుకు దిగ‌జారి పోతూ వ‌స్తోంది. 2018 ఎన్నిక‌ల్లో అయితే రాజ‌కీయంగా కాంగ్రెస్ ను స‌మాధి చేసేందుకు పుట్టిన టీడీపీ తో పొత్తు పెట్టుకున్నా కూడా చిత్తుగా ఓడిపోయింది. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఓడిపోయాక కాంగ్రెస్ మ‌రి కొంత మంది కీల‌క నేత‌లు కూడా ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేసేశారు. ఎట్ట‌కేల‌కు మ‌ల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వ‌డంతో జ‌నాల్లో ఇప్పుడిప్పుడే మార్పు వ‌స్తోంది.

రేవంత్ యాక్ష‌న్ ప్లాన్ స్టార్ట్ అయ్యిందో లేదో తెలంగాణ లో కాంగ్రెస్ కు స‌రికొత్త జోష్ వ‌చ్చిన‌ట్టే క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం మాత్ర‌మే ఉంది. రేవంత్ ఆధ్వ‌ర్యంలోనే అక్క‌డ ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ స‌న్న‌ద్ధం అవుతోంది. అయితే ఈ సారి కూడా అక్క‌డ కాంగ్రెస్ ఓడిపోతే అస‌లు పార్టీని అక్క‌డ మ‌ర్చిపోవ‌డ‌మే. అయితే రేవంత్ ఈ సారి ఆ ఛాన్స్ ఉండ‌కూడ‌ద‌ని క‌సితో ప‌ని చేస్తున్నారు. ఎంతో రిస్క్ చేసి మ‌రీ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన‌ప్ప‌ట‌కి కూడా అక్క‌డ ప్ర‌జ‌లు రెండు సార్లు ఓడించారు.

అయితే స‌మ‌ర్థ వంత‌మైన నాయ‌క‌త్వ స‌మ‌స్య కూడా ఆ పార్టీని ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ వెంటాడింది. అయితే ఈ సారి అభ్య‌ర్థుల ఎంపిక‌లో రేవంత్ రెడ్డి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ఎక్కువుగా యువ నేత‌ల‌తో పాటు కొత్త తరానికే అవకాశం ఇవ్వాలని రేవంత్ నిర్ణయించారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ సీనియ‌ర్ల నేత‌ల వ‌ల్ల పార్టీ ఇప్ప‌టికే చాలా న‌ష్ట‌పోయింది అన్న‌ది వాస్త‌వం. అందుకే వారికి చెక్ పెట్టేందుకు క్లీన్ ఇమేజ్ ఉన్న యువ నేత‌ల‌ను తెర‌మీద‌కు తీసుకు వ‌చ్చేందుకు రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. ఇక హై క‌మాండ్ ను కూడా అభ్య‌ర్థుల ఎంపిక‌లో త‌న‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేలా రేవంత్ ఒప్పించు కుంటే స‌క్సెస్ అయిన‌ట్టే..!

మరింత సమాచారం తెలుసుకోండి: