గుంటూరు జిల్లా వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన యువ నాయ‌కుడు మ‌ద్దాలి గిరి. అయితే.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఆయ‌న పార్టీ మారి వైసీపీ చెంత‌కు చేరిపోయారు. గ‌తంలో ఆయ‌న‌ను పార్టీలోకి తీసుకువ‌చ్చిన మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్‌కు మ‌ద్దాలి గిరికి కొన్ని రోజులుగా దూరం పెరిగింద‌నే వాద‌న వినిపిస్తోంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న ప‌రిస్థితి ఏంటి? అనే చ‌ర్చ జోరుగా జ‌రుగుతోంది. నిజానికి మ‌ద్దాలి గిరిపై ఎలాంటి కేసులు లేవు. ఆయ‌న‌కు ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు. కానీ, పార్టీ మారారు.

దీనికి రీజ‌నేంటి? ఇదే ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గా మారింది. నిజానికి ఏదైనా కేసులు ఉండో..లేక భారీ ఎత్తున వ్యాపారాలు ఉండో.. వాటికి ప్ర‌భుత్వం నుంచి ఆటంకాలు వ‌స్తాయ‌ని అనుకున్న నాయ‌కులు పార్టీ మార‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా కొంద‌రు మారారు కూడా. కానీ.. మ‌ద్దాలి విష‌యంలో కేవ‌లం సామాజిక వ‌ర్గం ప్ర‌భావంతోనే అంటే.. మ‌నంద‌రం ఒకే పార్టీలో ఉందాం.. అనే పిలుపుతోనే ఆయ‌న వ‌చ్చార‌ని కొన్నాళ్లు ప్ర‌చారం జ‌రిగింది.

కానీ, వాస్త‌వం ఏంటంటే.. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి లేదా.. త‌త్స‌మాన‌మైన ప‌ద‌విని ఇప్పిస్తాన‌నే హామీతో తీసుకువ‌చ్చార‌ని.. గిరి వ‌ర్గం చెబుతోంది. అయితే.. ఇప్ప‌టికీ.. దీనిపై క్లారిటీ లేక‌పోవ‌డం.. మంత్రివ‌ర్గం ఆశ‌లు కూడా ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డంతో మ‌ద్దాలి గిరికి, మంత్రి వెలంప‌ల్లికి గ‌తంలో ఉన్న సంబంధాలు అయితే.. ఇప్పుడు క‌నిపించ‌డం లేద‌నేది వాస్త‌వం. గ‌తంలో ఇద్ద‌రూ క‌లిసి మెలిసి కార్య‌క్ర‌మాలుచేసేవారు.కానీ, ఇటీవ‌ల కాలంలో ఆయ‌న దూరంగా ఉంటున్నారు. మంత్రి పాల్గొంటున్న కార్య‌క్ర‌మాల్లో క‌నిపించ‌డం లేదు.

దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న పార్టీలో ఉంటారా?  తిరిగి అయిందేదో అయింది.. తిరిగి వ‌చ్చేయ‌మంటే టీడీపీలోకి వెళ్లిపోతారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఎందుకంటే.. ప‌శ్చిమ ఓట‌ర్ల‌లో ఎక్కువ మంది ఇటీవ‌ల జ‌రిగిన స్తానిక ఎన్నిక‌ల్లోనూ టీడీపీకే ఎక్కువ గా ఓట్లేశారు. సో.. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో మ‌ద్దాలి గిరి ఏం చేస్తార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: