ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోయాయి. రోజుకు పదుల సంఖ్యలో ప్రయాణీకులు మరణిస్తున్నారు. ఇటు బస్సు ప్రమాదంలో అయినా.. అటు ఇతర వాహనాల్లో ప్రయాణించేవారైనా ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ప్రజల్లో ఒకరమైన అభద్రతా వాతావరణం తలెత్తుతోంది. అంతేకాదు జిల్లాలకు.. రాష్ట్రాలకు రాకపోకలు సాగించే ఆర్టీసీ లేదా ప్రైవేట్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. డ్రైవర్ నిద్రమత్తువల్లో.. లేక రోడ్డు సరిగా లేకనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లను ప్రత్యేక సూచనలు చేశారు.
ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఇకపై హైదరాబాద్ లోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలలో శిక్షణ పొందాలని హెచ్చరించారు. అంతేకాదు వరంగల్ శిక్షణ కేంద్రంలో వారి డ్రైవింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. దంటే టిఎస్‌ఆర్‌టిసి భారీ జరిమానాలు విధించడానికి వెనుకాడదని ఆ డ్రైవర్లను హెచ్చరించారు. ప్రైవేట్ అద్దె బస్సు యజమానులు తమ మార్గాలను సరిదిద్దకుంటే వారితో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవడానికి కూడా వెనుకాడబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డ్రైవర్లు అతివేగంతో ప్రయాణీకుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి. అలాంటి డ్రైవర్లను వెంటనే గుర్తించి వారికి శిక్షణ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఎలాంటి సత్ఫలితాలనిస్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి