12 మున్సిపాల్టీలు 1 కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మావే అని ఊదరగొడ్తోంది వైసీపీ. ఇది ఎలా ఉన్నా కూడా ఈ గెలుపు మాత్రం పక్కా డీజీపీకే అంకింతం ఇవ్వాలని అంటున్నారు టీడీపీ బాస్ అచ్చెన్నాయుడు. ఇవాళ ఆయన ఎన్నికల ఫలితాల తరువాత విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చాలా విశ్లేషణాత్మకంగా మాట్లాడారు. ఆశావహ దృక్పథంతో మాట్లాడారు. కుప్పంలో ఓటమిని ఫోకస్ చేయడం తగదని, ఓ మంత్రి స్థాయి వ్యక్తి తనని తాను దిగజార్చుకుని దొంగ ఓట్లు వేయించడం ప్రజా స్వామ్య చరిత్రలోనే లేనే లేదని అంటూ తాము కుప్పం ఓటమిని పట్టించుకోమనే అన్నారు. తాము ఎన్నో ఒడిదొడుకులు దాటుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచామని, తమను గెలిపించిన కార్యకర్తలకు, ప్రజలకు పాదాభివందనాలు చేస్తున్నామని అన్నారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే...
కమలాపురం, దర్శి, బేతంచర్ల మున్సిపాల్టీలలో వైసీపీకి 49 శాతం టీడీపీకి 46 శాతం ఓట్లు వచ్చాయి. అంటే మూడు శాతం ఓట్ల తేడాతో టీడీపీ ఓడిపోయింది. ప్రభుత్వ పతనానికి ఈ ఎన్నికలే నాంది. ప్రజల తిగుబాటు ఇది. ఏడు మున్సిపాల్టీల్లో హోరా హోరీ పోరు సాగింది. రెండింట విజయం మాదే! మరొకటి కూడా మా ఖాతాలోనే! చేతనైతే మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలి. గెలిస్తే తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేస్తాం.కన్ను పోయి లొట్ట మాదిరిగా గెలుపు ఇది. అంటూ అచ్చెన్న ఫైర్ అయ్యారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి