ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆయనకు ఎటువంటి ఇబ్బందులు కూడా వచ్చే పరిస్థితి ఉండదు అనే మాట వాస్తవం. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ కూడా ప్రభుత్వంలో కాదు అనే పరిస్థితి దాదాపుగా ఉండదు అనే మాట అందరికీ తెలిసిందే. ఎక్కడో ఒకటి రెండు చోట్ల విపక్షాలు దీనికి సంబంధించి రాద్ధాంతం చేసిన సరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని దాదాపుగా వెనక్కు తీసుకునే పరిస్థితి ఉండదు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నారు అని వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి.

మూడు రాజధానులు కు సంబంధించి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నా సరే కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వచ్చింది అనే మాట వాస్తవం. దానికి తోడు శాసనమండలిని రద్దు చేస్తూ గత ఏడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుని మళ్లీ దాన్ని ఉపసంహరించుకుంటూ కొత్త తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశ పెట్టడం అనేది సంచలనమైన అంశంగా చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గింది అనేది అందరికీ అర్థమైంది.

ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని కొన్ని నిర్ణయాల విషయంలో ప్రభుత్వం లో అనుభవం ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు సలహాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని గతంలో తన తండ్రి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన వారికి శాసన సభలో విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుడు విపక్ష బలపడే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రతి విషయాన్ని కూడా టార్గెట్ చేసుకుని మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి సీనియర్ నాయకులు సలహాలు సూచనలు ఉంటే మాత్రం అది జగన్ కి కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: