ప్రస్తుతం ఏపీ రాజకీయాలు వాడివేడిగా గానే కొనసాగుతూ ఉన్నాయ్. ఇటీవలే అసెంబ్లీలో జరిగిన ఘటన తర్వాత చంద్రబాబు ఎంతో దూకుడు పెంచారు. జగన్ ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టడానికి చంద్రబాబు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి విమర్శలు గుప్పిస్తున్నారు చంద్రబాబునాయుడు. ఈ క్రమంలోనే ఇటీవలే  తిరుపతిలోని పాపా నాయుడు పేటలో జరిగిన సమావేశంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న పాలన ప్రజాస్వామ్యం కాదు ఉన్మాద స్వామ్యం అంటూ చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. మడమ తిప్పను మాట తప్పను అంటూ గొప్పలు చెప్పుకున్న జగన్ ఇక ఇప్పుడు గిరగిరా తిప్పుతూ నే ఉన్నాడు అంటూ విమర్శలు గుప్పించారు చంద్రబాబు నాయుడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కంటే తుగ్లక్ ఎంతో నయం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. తిరుపతి లో వచ్చిన వరదలు ప్రకృతి విలయం కారణంగా రాలేదు జగన్ పట్టించుకోకపోవడం ఈ కారణంగానే వచ్చాయి అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్కు ఎలాంటి ముందుచూపు లేకపోవడం కారణంగానే ఇక ప్రస్తుతం ఇలాంటి దుస్థితి ఏర్పడింది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.. నేను అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంక్షోభ సమయంలో ఎలా స్పందించాను.. ఇక ఇప్పుడు సీఎం జగన్ ఎలా స్పందిస్తున్నారు ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలు మంచి చెడులను విశ్లేషించుకుని ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. జగన్ మానసిక స్థితి బాగాలేదు. మామూలు వ్యక్తి అలా ఉన్నా పర్లేదు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా ఉంటే  ప్రజలందరికీ ప్రమాదం అంటూ చంద్రబాబు విమర్శించారు. మరి వెయ్య వద్దు అంటూ  ప్రభుత్వం చెబుతోంది.. వరి వేయకుండా గంజాయి వేయాలా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు.. ప్రపంచంలోనే రాష్ట్రానికి జగన్ ప్రభుత్వం చెడ్డపేరు తెప్పించింది అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: