డబ్బులుంటే సినిమాలు అనుకునే రోజులు పోయాయి. అలా అనుకుంటే ఇక‌పై సినిమాలు తీయ‌డ‌మే వేస్ట్. టేస్టు ఉన్న ప్రొడ్యూస‌ర్ కార‌ణంగానే మంచి సినిమా వ‌స్తుంది కానీ డ‌బ్బులుంటే రాదు. గ‌తంలో క‌న్నా కాస్త భిన్నంగా సినిమాలు ఈ మ‌ధ్య కాలంలో థియేట‌ర్లలో కానీ ఓటీటీల్లో కానీ సంద‌డి చేస్తున్నాయి. కంటెంట్ బేస్డ్ స్టోరీల‌కు మంచి ప్రాధాన్యం ఉంటోంది. దీంతో చిన్నా  పెద్ద అన్న తేడాలేకుండా అన్ని నిర్మాణ సంస్థ‌లూ సినిమాను స్టోరీ బేస్డ్ ప్రొడ‌క్ట్ గానే చూస్తున్నారు. గుడ్ కంటెంట్, గుడ్ క్వాలిటీ అన్న‌వి ఇవాళ సినిమా జీవితాన్నే మార్చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఒక‌ప్ప‌టి ఇండ‌స్ట్రీకి ఇప్ప‌టి ఇండ‌స్ట్రీకి ఎంతో తేడా! హీరోలు వారి ఇమేజ్ లు చుట్టూ క‌థ‌లు ఉండేవి. ఇప్పుడు అలా కాదు కొంత‌లో కొంత కొత్త‌ద‌నం కోరుకుంటోంది. కొంత‌లో కొంత మంచి క‌థ‌ల‌కు ఆరంభం దొరుకుతుంది.దీంతో కొత్త యువ‌తీ యువ‌కుల‌కు అవ‌కా శాలు పెరుగుతున్నాయి. ఒక‌ప్పుడు ఇలా లేదు. హీరో ఇమేజ్ కు అనుగుణంగా సినిమా ఉండాల్సిందే. క‌థ‌లో ఎంత ప‌ట్టున్నా ఆ యన అభిమానులు కోరుకున్నవి లేక‌పోతే ఆ సినిమాల‌కు రోజులు లేన‌ట్లే! పెద్ద హీరోల సినిమాల్లో కూడా మంచి మార్పే వచ్చిం ది. క‌థ‌కు ప్రాధాన్యం ఇచ్చి సినిమా తీయాల‌న్న ఒక్క నియ‌మం ఇప్పుడు అంద‌రిలోనూ ఉంది. ఇలాంటి మార్పు కార‌ణంగానే మంచి క‌థ‌లు అప్పుడప్పుడూ అయినా వెలుగు చూస్తున్నాయి. వెబ్ సిరీస్ లు, ఓటీటీలు కార‌ణంగా ఒక‌ప్ప‌టి క‌న్నా ఇప్పుడు అవ‌కాశాలు ఎక్కువ. కొత్త క‌థ ఎంచుకుని అందుకు అనుగుణంగా సినిమాలు నిర్మించేందుకు అప్ప‌టి క‌న్నా ఇప్పుడు అవకాశా లు ఎక్కువ. ఈ త‌రుణంలో సినిమా కు సంబంధించి కొన్ని మార్పులు క‌థల ప‌రంగా జ‌రిగితే, మ‌రోవైపు సాంకేతిక అంశాలు కూ డా బాగా మెరుగు ప‌డ్డాయి.


ఈ తరుణంలో ఈ నేప‌థ్యంలో
బాల‌య్య అఖండ సినిమా ఓ వైపు వ‌స్తుంటే మ‌రో వైపు పుష్పతో అల్లు అర్జున్ సంద‌డి చేయ‌నున్నారు. వీటితో పాటు ఆర్ఆర్ఆర్ కూడా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. వాస్తవానికి అఖండ సినిమా బాల‌య్య నటించిన గ‌త సినిమాల క‌న్నా కాస్త ఎక్కువ తీవ్ర‌త ఉన్న క‌థ మ‌రియు క‌థ‌నం కూడా! ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌ను దాటుకుని ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే నెల రెండున వ‌స్తుంది. ఈ సినిమా సంగ‌తి అటుంచితే పుష్ప సినిమా పూర్తిగా ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ ను ఆధారంగా చేసుకుని శేషాచ‌లం అడ‌వుల్లో న‌డిచే కథ. ఈ సినిమా మొద‌ల‌యిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టిదాకా మంచి టాక్ తోనే రూపుదిద్దుకుంటోంది. అల్లు అర్జున్ త‌న గ‌త సినిమాల క‌న్నా భిన్నంగానే ఈ సినిమా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. రెండు  భాగాలుగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్  చేస్తున్నారు. త్వ‌ర‌లోనే మొద‌టి భాగం విడుద‌ల‌వుతోంది.

ఇక ఆర్ఆర్ఆర్ కూడా విభిన్న‌మ‌యిన క‌థ‌తోనే పిరియాడిక‌ల్ డ్రామాగా తెర‌కెక్క‌నుంది. వీటితో పాటు ఆచార్య కూడా ఓ సోష‌ల్  డ్రామానే ! కొర‌టాల శివ త‌ర‌హా క‌థ‌ల‌కు ఇదొక మంచి ఉదాహ‌ర‌ణ‌గా ఉండ‌నుంది. ఇంత‌టి సంద‌డిలోనూ నాగార్జున బంగార్రాజు కూడా రానుంది. సోగ్గాడే చిన్ని నాయ‌న‌కు ప్రీక్వెల్ గా ఈ సినిమా రూపొంద‌నుంది. క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమా కూడా సంక్రాంతికే సంద‌డి చేయ‌నుంది. వీటితో పాటు భీమ్లా నాయ‌క్, స‌ర్కారు వారి పాట సినిమాలు కూడా మంచి క‌థల‌తో రూపుదిద్దుకున్నాయి. ఇప్పుడొస్తున్న సినిమాల‌న్నీ ఆయా క‌థానాయ‌కుల గ‌త చిత్రాల కంటే భిన్న‌మైన‌వే! మంచి క‌థ క‌థ‌నం అన్న వాటిని ప్రాణం గా నిలుపుకుంటే  మంచి సినిమాలు వ‌స్తాయి. క‌థ విడిచి సాము చేస్తే మినిమం గ్యారెంటీ కూడా ఉండ‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి: