సాధారణం గా ఏ దేశం అయినా సరే వృద్ధిరేటు సాధించడానికి ఎంతో వ్యూహాత్మకం గా అడుగులు వేస్తూ ఉంటుంది. దౌత్య పరం గా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ సంబంధాలను మెరుగు పరుచుకుంటూ ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ క్రమం లోనే అటు చైనా కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అయితే సక్రమ దారిలో వెళ్లడానికి కాదు దొడ్డిదారిలో వెళ్లడానికి ఇక తమ వ్యూహాలను ఉపయోగిస్తూ ఉంటుంది చైనా. ప్రతి విషయంలో కూడా చైనా అనుసరించే తీరు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
 ఎప్పుడూ ఇతర దేశాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని దొంగిలించెందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇతర దేశాలకు చెందిన రక్షణ రంగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని వివిధ వస్తువులకు సంబంధించిన సమాచారం లపై కూడా సైబర్ ఎటాక్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పటికే అమెరికా వ్యవస్థపై సైబర్ ఎటాక్ చేసిన చైనా ఎన్నోసార్లు ఇక అమెరికా సంబంధించిన ఎంతో కీలకమైన డేటాను దొంగిలించింది అన్న విషయం తెలిసిందే. ఇలా వివిధ దేశాల పై సైబర్ దాడికి పాల్పడిన చైనా.. తమ దేశంపై భారత్ సైబర్  దాడులకు పాల్పడుతోంది అంటూ చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. అది ఇప్పటికే అమెరికా సంబంధించిన ఈ మెయిల్ సహా మిగతా అన్నింటిపై సైబర్ ఎటాక్ చేసి కీలక సమాచారాన్ని  చైనా దొంగిలించింది అన్న విషయాన్ని ఇటీవలే అమెరికా బయట పెట్టింది.. అయితే ప్రపంచం లోనే అత్యధిక సైబర్ ఎటాక్ తమపైన జరిగిందని.. చరిత్ర లోనే ఎన్నడూ లేనంత ఏకంగా తమ దగ్గర ఉన్న మెయిల్స్ సంబంధించిన వివరాలను కాజేశారు అంటూ అమెరికా ఆరోపిస్తుంది. అయితే దీనిపై స్పందించిన చైనా తమకు దీంతో ఎలాంటి సంబంధం లేదు అంటూ ఎప్పటిలా గానే కల్లబొల్లి మాటలు చెబుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: