సాధారణంగా సముద్రం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక భారీగా అలలు ముందుకు దూసుకు వస్తూ వెనక్కి వెళుతూ ఉంటాయి. ఏకంగా కొత్తగా వెళ్ళినవారు సముద్రాన్ని చూసి భయపడిపోతుంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే సముద్రం ఎప్పుడూ  హై స్పీడ్ తో ముందుకు దూసుకు వస్తుంది తప్ప వెనక్కి వెళ్లడం మాత్రం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని కొన్ని ప్రాంతాలలో సముద్రం వెనక్కి వెళ్లడం లాంటి చిత్రమైన ఘటనలు జరగడం కూడా అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.



 కొన్ని ప్రాంతాలలో అయితే ఏకంగా కిలోమీటర్ల దూరం వరకూ సముద్రం వెనక్కి వెళ్లడం జరుగుతుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటిదే జరిగింది. సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లడంతో ఇక మత్స్యకారులు అందరూ ఆందోళనలో మునిగిపోయారు. అనూహ్యంగా సముద్రం వెనక్కి వెళ్లడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇలా సముద్రం వెనక్కి వెళ్లిన ఘటన ఎక్కడో జరిగింది కాదు మన ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా భోగాపురం వద్ద జరగడం గమనార్హం. ఇక భోగాపురం వద్ద ఉన్న సముద్రం వెనక్కి వెళ్లడం మాత్రం అందరినీ ఆందోళన కలిగిస్తుంది..


 సాధారణంగా అయితే తుఫాను సమయంలో సముద్రం సాధారణం కంటే ఎక్కువగా ముందుకు వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఇందుకు భిన్నంగా ఏకంగా వెనక్కి వెనక్కి వెళ్ళింది సముద్రం . భోగాపురం మండలం ముఖం గ్రామం వద్ద సముద్రం ముక్కామ్ వద్ద వంద మీటర్లు వెనక్కి వెళ్ళింది. ఇక ఇది గమనించిన మత్స్యకారులు ఆందోళనలో మునిగిపోయారు. సాధారణంగా పౌర్ణమి అమావాస్య సమయంలో ఇలా సముద్రం వెనక్కి వెళ్తుంది అన్న విషయం తమకు తెలుసు. కానీ తుఫాన్ సమయంలో ముందుకు దూసుకు రావాల్సిన సముద్రం ఇలా అకస్మాత్తుగా వెనక్కి వెళ్లడం మాత్రం ఎప్పుడూ జరగలేదని.. ఇదే మొదటిసారి అంటూ మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

See