ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఒకటే భయం పట్టిపీడిస్తోంది.. మొత్తం అన్ని దేశాలు కూడా ఓమిక్రాన్ వైరస్ విజృంభిస్తుందన్న భయం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే రెండు దశల వైరస్  ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి ప్రపంచదేశాలు. ఆంక్షలు తొలగిస్తూ ఉండడంతో  మళ్లీ సాధారణ జీవితంలోకి అడుగు పెడుతున్నారు ప్రపంచ ప్రజానీకం. ఇలాంటి సమయంలో ఇక ఇటీవల ఓమిక్రాన్ వైరస్ వెలుగులోకి రావడం వేగంగా వ్యాప్తి చెందుతూ వుండటం ఎంతో భయాందోళనకు గురి చేస్తుంది అని చెప్పాలి. దీంతో ఇక మళ్ళీ అన్ని దేశాలు కూడా లాక్ డౌన్ లోకి వెళ్లే పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ఎంతో ప్రమాదకరమైనది అని అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఓమిక్రాన్  విషయంలో  ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఇక తక్కువ సంఖ్యలో కేసులు వెలుగులోకి వచ్చినప్పటికీ కఠిన ఆంక్షలు అమలులోకి తెస్తున్నాయి ప్రభుత్వాలు. ఇక అన్ని దేశాల ప్రభుత్వాలు ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా పరీక్షలు చేసుకోవాలి అంటూ నిబంధనలు విధించాయ్ అన్న విషయం తెలిసిందే. ఇక్కడ అయితే ఏకంగా రెండు కేసులు వెలుగులోకి వచ్చినందుకుగాను ఏకంగా రెండు వేల మందిని క్వారంటైన్ లో పెట్టడం సంచలనంగా మారిపోయింది.



 స్విజర్లాండ్ జెనీవాలోని ఓ స్కూల్లో ఇద్దరు విద్యార్థులకు ఓమిక్రాన్  వైరస్ సోకిన ఇటీవలే వెల్లడైంది. దీంతో పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థులతో పాటు సిబ్బంది కూడా క్వారంటైన్ లోకి వెళ్లాలి అంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. పాఠశాలలో మొత్తం విద్యార్థులు సిబ్బందితో అందరూ కలిసి రెండు వేల మంది ఉంటారు. ఇక ఈ రెండు వేల మంది కూడా పది రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి అంటూ తెలిపింది ప్రభుత్వం. ఇక క్వారంటైన్ లో ఉన్న రెండు వేల మందికి కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఓమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కట్టడి కోసం 19 దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పై నిషేధం విధించింది స్విట్జర్లాండ్ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: