తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు అన్ని విధాలుగా కూడా తెలంగాణలో లేకుండా చేసిన నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ తెలంగాణలో బలపడే విధంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ పార్టీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పెంచుకునేందుకు అన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ ను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా పరిపాలన విషయంలో కూడా జోక్యం చేసుకుంటూ ఎన్నడూ లేనివిధంగా బిజెపి నాయకులు టిఆర్ఎస్ పార్టీని అలాగే సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న సందర్భం ఎప్పుడు లేదనే చెప్పాలి.

దుబ్బాక ఉప ఎన్నికలు అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు హుజురాబాద్ ఎన్నికలు టిఆర్ఎస్ పార్టీ ని బాగా ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ అవకాశాలను సృష్టించుకొనే ప్రయత్నం చేస్తోంది. అయితే భారతీయ జనతా పార్టీని చాలా నియోజకవర్గాల్లో కట్టడి చేయడానికి సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏ విధంగా ముందుకు రాబోతున్నారు ఏంటనే దానిపై టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా ఒక క్లారిటీ రావడం లేదనే చెప్పాలి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మరింత బలపడితే మాత్రం సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు సీఎం కేసీఆర్ కొన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నారని తెలంగాణలో క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న కొన్ని పార్టీలు దగ్గర చేసుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వామపక్షాలను సీఎం కేసీఆర్ దగ్గర చేసుకునే ప్రయత్నంలో భాగంగానే త్వరలో జాతీయ నాయకత్వాన్ని కూడా కలిసే అవకాశం ఉందని భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ముందుకు వెళ్లేందుకు తృతీయ ఫ్రంట్ రూపంలో తెలంగాణలో వామపక్షాలను వాడుకునే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr