కోవిడ్ -19 కొత్త వేరియంట్ ఓమిక్రాన్ మానవాళిని తాజాగా భయపడెతున్న వేళ భారత ప్రభుత్వం కరోనా పరీక్షలలో నూతన  అధ్యాయానికి నాందీ పలికింది.  గతంలో రెండు మూడు రోజులు పట్టే  పరీక్షల నివేదికలు ప్రస్తుతం అరగంటలో నే వస్తున్నాయి. అయితే ఇవి దేశం లోన్ని అన్ని ప్రాంతాలలో కాదు. కేవలం  ఒకే ఒకచోట మాత్రమే ఈ  పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.
విదేశాల నుంచి భారత్ లో ప్రవేశించే ప్రయాణికులకు ఇది నిజంగానే శుభవార్త.  కవిడ్-19 లో కీలకమైన ఆర్టీ-పిసిఆర్ పరీక్షల నివేదికలు ఇక  త్వరంగా అందనున్నాయి.  భారత ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు చేసింది.  ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత ప్రభుత్వం ఆర్టీ-పిసిఆర్  టెస్టింగా మిషన్ లు  ఏర్పాటు చేసింది. అది కూడా టెర్నినల్  3 లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కోవిడ్-19 తాజా స్వరూపం ఓమిక్రాన్ మానవాళిని రోజు రోజుకూ మరింతగా భయపెడుతున్న వేళ ఈ పరికరం అందుబాటు లోకి  రావడం ఆనందంగా ఉందని విదేశాల నుంచి స్వదేశం వస్తున్న ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయా ఓమిక్రాన్ ప్రభావం, తాజాగా తీసుకుంటున్న చర్యలపై తన సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్టీ-పిసిఆర్ పరీక్షలు, విదేశాల నుంచి వస్తున్న వారికి నిర్వహిస్తున్న పరీక్షలు, సౌకర్యాలు తదితర విషయాలపై సూధీర్ఘంగా చర్చించారు.  ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన విదేశీ ప్రయాణీకుడికి ఓమిక్రాన్ఉన్నట్లు  తేలినట్లు ఆరోగ్య శాఖ అధికారులు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.
 టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తికి ఓమిక్రాన్ సోకినట్లు తేలిందన్నారు. రోగి గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులతో పాటు, బలహీనంగా ఉన్నట్లు  ఆ ప్రయాణీకులు  విమానాశ్రయం అధికారులు తెలిపాడని, వెంటనే పరీక్షలు చేయగా ఓమిక్రాన్  ఉన్నట్లుగా తేలిందని తెలిపారు. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం  ఢిల్లీ లోని లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించి నట్లు ఆరోగ్య శాఖ అధికారులు మంత్రి మాండవీయా కు వివరించారు.
గడచిన నెల రోజుల క్రితం నుంచి భారత్ లో ప్రవేశించిన వారి జాబితా ను  సేకరించాలని, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుకుకోవాలని మంత్రి తన సిబ్బందికి అదేశించారు. రాష్ట్రాలను సమన్వయం చేసుకుని విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించాలని, తనకు నివేదిక ఇవ్వాలని మంత్రి  ఆదేశించారు. అరగంటలో పరీక్షా ఫలితాలు ఇచ్చే మిషీన్ లను దేశమంతా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని  కూడా మంత్రి తన ఆదేశాలలో పేర్కోన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: