టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లిన నేతలు ఆ ఇద్దరూ.. ఇంటర్వెల్ లేకుండా తిట్లు తిడుతూ రాజకీయం చేస్తున్నదీ ఆ ఇద్దరే! వారే కొడాలి నానీ, వల్లభనేని వంశీ. చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా, లోకేశ్ కూ అదే స్థాయిలో తిట్లు వినిపించి జగన్ దగ్గర మార్కులు కొట్టేద్దామన్న ఆతృత వీరిద్దరికీ ఉంది. అంత స్వామి భక్తి ఎప్పుడు వచ్చిందో కానీ మొత్తానికి రాష్ట్ర రాజకీయంలో తిరుగులేని శక్తిగా మారిపోయారు నానీ. అసెంబ్లీలో వరుస రెండు సార్లు  గుడివాడ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న నానీ తనకంటూ ఓ మార్కు ఓ రాజకీయం వేసుకున్నారు.


తాము ఎక్కడి నుంచి వచ్చామో అన్నది మరిచిపోయి తిట్టడంలోనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నా రు. ఓ విధంగా అధినేత జగన్ కూడా వీరిని బాగానే ప్రోత్సహిస్తున్నారన్న టాక్ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్లో! గుడివాడ అంటే నానీకి ఎంత ఇష్టమో అన్నది అటుంచితే తిట్లంటే మాత్రం ఆయనకు మాత్రం బాగా ఇష్టం.

ఇక నానీకి తిరుగులేని నేతగా ఎలా పేరు వచ్చిందో కానీ వచ్చేసింది. ఒక ప్రెస్ ను అడ్రస్ చేసి మాట్లాడినా  లేదా ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా తన స్థాయి ఏంటో తెలియకుండా మాట్లాడడంతో ఆయనకు చాలా పేరు వచ్చేసింది. ఎదురుగా ఎవ్వరున్నారన్న కనీస ఆలోచన లేదా స్పృహ లేకుండా మాట్లాడడంతోనే ఆయనకు పేరు వచ్చేసింది. బెజవాడ లీడర్లలో నానీకి తోడుగా వంశీ ఉండడం తో ఇక టీడీపీకి ఓ రేంజ్ లో తలనొప్పులు మొదలయ్యాయి. ఇంతకూ ఈ బూతుల మంత్రికి బూస్టర్ డోస్ ఏంటి అంటే.. ఆయనకు కాస్తో కూస్తో స్థానికంగా పట్టు ఉండడం, అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి అంతో ఇంతో ప్రాధాన్యం ఇవ్వడం..ఎన్టీఆర్ అభిమాని గా తెచ్చుకున్న పేరుతో రాజకీయం చేయడం ఇవే ఆయనకు గెలుపునకు బూస్టర్ డోస్. 



ఒకప్పుడు హరికృష్ణ అనుచరుడు.. ఆ మాటకు వస్తే వంశీ కూడా పరిటాల రవి అనుచరుడు. ఇలా అనుచరులంతా మంత్రులో లేదా కీలక స్థానాలకు అధిపతులో అయ్యేందుకు కాలం ఎంతగానో సహకరించింది. అదే ఇప్పుడు పెద్ద తలనొప్పి.  తమ బలం కన్నా స్థాన బలం మిన్న అన్న గర్వంతోనే వీరంతా విర్రవీగుతున్నారు అన్న విమర్శ కూడా ఉంది.. అది కూడా వీరికో బూస్టింగ్ పాయింటే!  ఇప్పటిదాకా వీరు చెప్పిన విధంగానే బెజవాడ రాజకీయం ఉన్నా రేపటి వేళ కూడా వీరికి జగన్ అంతే స్థాయిలో వాల్యూ ఇస్తారా లేదా వాడుకుని వదిలేస్తారా ?



మరింత సమాచారం తెలుసుకోండి:

ycp