తిట్టడం వారి హక్కు ..వినడం మన బాధ్యత. ఎవరు ఏం అనుకున్నా వారికేం పట్టింపూ ఉండదు. తిట్టడంలో స్వామి భక్తి ఉంది. అపోజిషన్ లీడర్ల ను తిట్టడం అంటే చిన్న విషయమా! ఎందుకు ఇలా పార్టీ పరువు తీస్తున్నారని ఎవ్వరయినా సోషల్ మీడియాలో అడిగారా ఇక వాళ్లు చచ్చారే! ఇదీ ఇవాళ్టి రాజకీయం. రాష్ట్ర మంత్రుల భాషకు ఓ స్థాయి లేదు. వారికి ఓ నడవడి లేదు. నోటికి హద్దు లేదు. నియంత్రణ లేదు. నిబద్ధత అన్నది వారి ప్రవర్తన నుంచి ఆశించడం ఓ పెద్ద తప్పు.
రాష్ట్రంలో ప్రజా సమస్యలపై మాట్లాడే నాయకులు లేరు. అసలు ఆ అవసరం ఎవరికీ లేదు కూడా! ఉన్నంతలో వివాదాలు ఉన్నత స్థాయిలో వివాదాలు మాత్రమే నడుస్తుంటాయి.నడుపుతుంటారు కూడా! అందుకు వారికి ఏ ఇబ్బందీ ఉండదు. ఏ సమస్యా రాదు. అందుకనో ఎందుకనో ఎప్పటికప్పుడు వైసీపీ నాయకులు తిట్ల దండకం అందుకోవడంలో ముంందుంటారు. అధికారులను బెదిరించడంలో ఇంకా ముందుంటారు. రూల్స్ ను వాయిలేట్ చేయడంలో ఇంకా ముందుంటారు. ఇవి తప్ప వాళ్లేం చేయరు. చేయలేరు కూడా! ముందుగా బూతులు తిట్టే శాఖ ఒకటి ఏర్పాటు చేస్తే మాత్రం కొడాలి నానికి అందులో ప్రధాన వాటా ఇవ్వాలి.
అంతగా తిడుతున్నారు అంటే జగన్ ప్రోత్సాహం ఉండకుండా ఉండదు. ఆయన తెర వెనుక ఉండి నడిపిస్తున్న డ్రామా కనుకనే చంద్రబాబును నోటికివచ్చినంత తిడుతున్నారు.
కమ్మ సామాజిక వర్గ నేతలను అదే కులంకు చెందిన మనుషులతో కూలంకుషం గా తిట్టించడంతోనే జగన్ చాలా వరకూ సక్సెస్ అయ్యారు. పోనీ అక్కడితో అయినా ఆగుతున్నారు మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ ఇలా ఒక్కరేంటి ఎవరు పడితే వారు బూతులు మాట్లాడతుంటారు. ఇదేమని అడిగితే సొంత మనుషులు అయినా సరే వాళ్ల ఇళ్లపైకి దాడులకు వెళ్తారు. చంపేస్తాం అంటారు. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి