జగన్ ప్రభుత్వం వచ్చి రెండున్నర ఏళ్ళు దాటింది..అయితే ఇప్పటివరకు ముందస్తు ఎన్నికలపై ఎలాంటి చర్చ జరగలేదు. అసలు ముందస్తు ఎన్నికల గురించి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు వెళ్లడానికి రెడీ అవుతుందని మాత్రం కథనాలు వచ్చాయి. కానీ ఒకేసారి దేశ వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం అనేది సాధ్యపడే విషయం కాదు...అందుకే జమిలి ఎన్నికల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింట్లే కనిపించింది.

కానీ ఏపీలో మాత్రం ముందస్తు ఎన్నికలపై చర్చ రాలేదు. తెలంగాణలో మాత్రం ముందస్తు ఎన్నికలపై చర్చ నడుస్తూనే ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే గెలిచారు. అందుకే అక్కడ మరోసారి ముందస్తు ఎన్నికలపై చర్చ నడుస్తోంది. అయితే అక్కడ ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్ ముందస్తుకు వెళ్లొచ్చని మాట్లాడుతున్నాయి.  టీఆర్ఎస్ నేతలు మాత్రం ముందస్తుకు వెళ్ళే అవకాశాలు లేవని అంటున్నారు. అలా అని టీఆర్ఎస్ నేతల  మాటలు నమ్మడానికి లేదు. ప్రతిపక్షాలు అలెర్ట్ గా లేని సమయం చూసుకుని ముందస్తుకు వచ్చేస్తారు.


ఇక ఏపీలో కూడా ఇప్పుడు ముందస్తు ఎన్నికలపై టీడీపీ చర్చ లేపింది...జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు మాట్లాడుతున్నారు. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దీనిపై మాట్లాడారు. తమని ప్రజలు ఐదేళ్లు పాలించమని అధికారం ఇచ్చారని, ఐదేళ్ల పాటు జగన్ పాలిస్తారని అంటున్నారు.

కానీ నిప్పు లేనిదే పొగ రాదని విశ్లేషకులు అంటున్నారు. ఈ ముందస్తుపై రెండు పార్టీలు పోలిటికల్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో రోజురోజుకూ వైసీపీకి యాంటీగా పరిస్తితులు మారుతున్నాయి. దీంతో జగన్ ముందస్తుకు వెళ్ళే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది. దీన్ని టీడీపీ ఇంకా పెద్దగా చేస్తుంది. దీని బట్టి చూస్తే రెండు రాజకీయ పార్టీలు ముందస్తు ఎన్నికలపై గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నాయి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: