తెలంగాణ సాధించుకున్న తర్వాత వరుసగా రెండుసార్లు కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ మొదటి నుంచి హరిత తెలంగాణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. చెట్లు బాగా పెంచాలని.. అడవులను సృష్టించాలని.. కేసీఆర్ పట్టుదలగా ఉంటారు. కోతులు వాపస్‌ పోవాలె.. వానలు వాపస్ రావాలె.. అన్న నినాదంతో ఆయన హరిత యజ్ఞానికి ఊపు తెచ్చారు. ఇప్పటికే పలుసార్లు హరిత హారం నిర్వహించి కోట్ల మొక్కలు నాటేలా చేస్తున్నారు. పల్లెల్లోనూ పచ్చదనం పెంచుతున్నారు.


అంతే కాదు.. అటవీ శాఖలో ఉద్యోగాల కోసం.. అడవుల సమర్థ నిర్వహణ కోసం ఏకంగా అటవీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏకంగా అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని తాజాగా కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లా ములుగులో  ఎఫ్‌సీఆర్‌ఐ విద్యాసంస్థ ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు చెబుతారు. నాలుగేళ్ల హానర్స్ డిగ్రీ ఇది. అందుకే ఇప్పడు ఈ ఎఫ్‌సీఆర్‌ఐ లో నాలుగేళ్ల బీఎస్సీ ఫారెస్ట్రీ డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్లకు అటవీశాఖ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు.


బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు చదివిన వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించడంతో ఇప్పుడు ఈ కోర్సుకు డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎఫ్‌సీఆర్‌ఐ లో నాలుగేళ్ల బీఎస్సీ ఫారెస్ట్రీ డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్లకు అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాల్లో 25 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విభాగంలో 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఫారెస్టర్స్‌ ఉద్యోగాల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్  నిర్ణయం తీసుకుంది.


ఎఫ్‌సీఆర్‌ఐలో నాలుగేళ్ల బీఎస్సీ ఫారెస్ట్రీ డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్లకు ఈ రిజర్వేషన్లు చాలా ప్లస్ అవుతాయి. పోటీ పరీక్షల్లో నాలుగైదు మార్కులే ఉద్యోగం వస్తుందో రాదో డిసైడ్ చేస్తాయి. అలాంటిది ఏకంగా 25 నుంచి 50 శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు. అందుకే ఎఫ్‌సీఆర్‌ఐ లో నాలుగేళ్ల బీఎస్సీ ఫారెస్ట్రీ డిగ్రీ పూర్తి చేసుకుంటే దాదాపు ఇక జాబ్ గ్యారెంటీ అన్నట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: