ఓజి మూవీ తో టాలీవుడ్ లో తిరుగు లేని హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ప్రియాంక మోహన్ తాజాగా పెళ్లి చేసుకున్నట్టు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అది కూడా ఓ హీరో.. అది ఎవరంటే అడివి శేష్.. మేజర్, హిట్-2, గూఢచారి వంటి సినిమాలతో ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అడివి శేష్ ప్రియాంక మోహన్ కి సంబంధించిన పెళ్లి ఫోటోలు తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో ఈ ఫోటోలు చూసిన చాలా మంది నెటిజన్లు ఇదేంటి ఈ జంట ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ప్రేమించుకున్నట్టు ఎవరికీ తెలియదు..కనీసం ఎక్కడ కూడా కలిసి తిరగలేదు. ఇలా సడన్గా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారేంటి అని ఆశ్చర్యపోతున్నారు. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

దీంతో అందరికీ ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయింది.అయితే ఇది రియల్ పెళ్లి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే వీరిద్దరిది రియల్ పెళ్లి కాదు రీల్ పెళ్లి.అడివి శేష్, ప్రియాంక మోహన్ ఇద్దరు కలిసి ఒక కంపెనీకి సంబంధించిన స్పెక్ట్స్ యాడ్ లో భాగంగా పెళ్లి చేసుకున్నట్టు నటించారు. అలా తాజాగా ఈ యాడ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నిజంగానే ఈ జంట పెళ్లి చేసుకున్నారు కావచ్చు అని షాక్ అయిపోయారు. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు ప్రేమించిన విషయం పెళ్లి చేసుకోబోయే విషయం కూడా ఎవరికీ చెప్పకుండా సడన్గా పెళ్లి చేసుకొని ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ షాక్ ఇస్తున్నారు.

 ఈ నేపథ్యంలోనే ఈ జంట కూడా అలాగే చేసిందేమో అనుకున్నారు. కానీ ప్రియాంక మోహన్ అడివి శేష్ ఇద్దరూ ఒక కంపెనీకి సంబంధించిన స్పెక్ట్స్  యాడ్ కోసం ఇలా పెళ్లి చేసుకున్నట్టు నటించారట. ఇక ఈ యాడ్ లో వీరిద్దరూ చాలా సాంప్రదాయబద్ధంగా కనిపించారు. ప్రియాంక మోహన్ రెడ్ కలర్ సారీ కట్టుకోగా.. అడివి శేష్ పట్టు పంచెలో మెరిసారు.అలా ఇద్దరు పెళ్లి చేసుకునేటప్పుడు ఎలా అయితే సాంప్రదాయమైన వస్త్రాలు ధరిస్తారా అలాగే ఉండేసరికి చాలామంది పెళ్లి చేసుకున్నారు కావచ్చని అనుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: