మనిషి కోతి నుంచి పుట్టాడు అన్నది జగమెరిగిన సత్యం. అయితే ఇక ఒకప్పుడు ఆదిమానవులు గా ఉన్న సమయంలో మనుషులు ఎలా ఉండేవారు అనేదానికి మన ముందు ఉండే చింపాంజీలు ఒక నిదర్శనంగా భావిస్తూ ఉంటారు ఎంతో మంది.  ఎందుకంటే ఒకప్పుడు ఆదిమానవుల కంటే ముందు మనిషి రూపమే ఇప్పుడు మనం చూస్తున్న చింపాంజీ అని అంటూ ఉంటారు. ఇక అటు చింపాంజీలు కూడా కొన్ని కొన్ని సార్లు అచ్చం మనిషి లాగానే ప్రవర్తించడం వంటివి కూడా చేస్తూ ఉంటాయ్. అయితే మనిషిని అనుకరించటంలో చింపాంజీలు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే.


 మనుషులు ఎలాంటిపని చేసినా ఇక దానిని ఒక్కసారి చూసాయ్ అంటే చాలు అలాంటివి అనుకరించడానికి ఎప్పుడూ ఆసక్తి చూపుతూ ఉంటాయి చింపాంజీలు. ఇలా ఇప్పటివరకు మనుషులను అనుకరిస్తూ ఏకంగా చింపాంజీలు గొప్ప ప్రతిభను కనబరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక్కడ కొన్ని చింపాంజీలు ఇలాంటివి చేస్తున్నాయ్. అయితే మనుషులను అనుకరించి బొమ్మలు వేయడం లాంటివి కాదు ఏకంగా మనుషుల్లాగా సిగరెట్ తాగడాన్ని అనుసరిస్తున్నాయి చింపాంజీలు. దీంతో ఇది అందరూ ఒక్కసారిగా అవాక్కవుతున్నారు.


 ఉత్తర కొరియా రాజధాని ప్యాంగంగ్ లో ఇటీవలే ఒక  జంతుప్రదర్శనశాలనూ పునఃప్రారంభించారు నిర్వాహకులు. ఇక ఈ జూ లోకి జంతు ప్రదర్శన కోసం వచ్చే అందరిని ఆకట్టుకునే విధంగా అక్కడ ఉన్న చింపాంజీల కు వెరైటీగా అధికారులు ట్రైనింగ్ ఇచ్చారు. మనుషులు ఎలాగయితే సిగరెట్ తాగుతారో అదే విధంగా  చింపాంజీలు కూడా సిగరెట్ తాగుతూ ఉంటాయ్ ఈ జూ లో. ఇక ఈ జూ లో ఉండే డల్లే అనే  ఒక చింపాంజీ అయితే అచ్చం మనుషులు తాగినట్లు గానే  ఎంతో స్టైల్గా సిగరెట్లు తాగుతూ గుప్పుగుప్పు మంటూ ఊదుతూ ఉంటుంది.  రోజుకి 40 సిగరెట్ల వరకూ తాగే అలవాటు ఉందట  ఆ చింపాంజీ కి.  లైటర్ తో స్టైల్గా సిగరెట్ వెలిగించుకొని అంతకంటే స్టయిల్ గా సిగరెట్ తాగుతూ అక్కడికి వచ్చిన అందరిని కూడా ఆశ్చర్యపరుస్తుంది ఈ చింపాంజీ. ఇక ఇది చూసిన తర్వాత మనుషులు జంతువులను కూడా చెడగొడుతున్నారుగా అని కొంతమంది ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wow