ఢిల్లీ : ఏపీ కి కేం ద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిన ట్లు సమాచారం అందుతోంది.   రెండున్నర గంటలపాటు కేంద్ర బృందం తో సమావేశం  నిర్వహించారు  వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి.  పోలవరం ప్రాజెక్టు మారిన వ్యయ అంచనాల  ఆమోదానికి కేంద్రం సుముఖంగా ఉందని  తెలిపారు విజయసాయి రెడ్డి.  గత పర్యటన సందర్బంగా ప్రధాన మంత్రికి ముఖ్య మంత్రి ఇచ్చిన  వినతి పత్రం లోని అన్ని అంశాలను ఈ సమావేశం లో చర్చించామన్నారు విజయసా యి రెడ్డి.   పరిష్కార మార్గాలను అన్వేషించాం.  సమావేశం చాలా సానుకూలంగా జరిగిందని వెల్లడించారు విజయసాయి రెడ్డి.  త్వరలోనే కేంద్రం నుంచి మంచి సమాచారం వస్తుందని స్పష్టం చేశారు విజయసాయి రెడ్డి.  కేంద్ర ప్రభుత్వం నుంచి 20 మంది ఉన్నతాధికారులు, ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు సమావేశంలో పాల్గొన్నారన్నారు విజయసాయి రెడ్డి.  

దీనికి కొనసాగింపుగా , సంబంధిత రాష్ట్ర అధికారులు నిరంతరం సంప్రదింపులు చేస్తారు. పెండింగ్ అంశాలన్నింటినీ ముందుకు తీసుకెళ్తారని చెప్పారు విజయసాయి రెడ్డి.  పోలవరం  సవరించిన  అంచనాలను యధావిధిగా   ఆమోదించేందుకు ఒక అవగాహనకు వచ్చామన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి. పునరావాసంతో సహా అన్ని అంశాలపై రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విధంగా చర్చలు జరుగుతాయని చెప్పారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి. రెవెన్యూ లోటు పై చ ర్చించాం... బడ్జెట్ సమయం లో బిజీగా ఉన్నా, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు రెండున్నర గంటల సమయం ఇచ్చారన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి.ముఖ్యమంత్రి ఇచ్చిన వినతి పత్రం, ప్రధాని ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగింది...  ముఖ్యమంత్రికి, రాష్ట్రానికి ప్రధానమంత్రి ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ సమావేశం నిదర్శనమని చెప్పారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: