మళ్ళీ మొదలు...జగనన్న జిల్లాల విభజన చేశారండి...ఈ విభజనతో జగన్ జనం మనసులు గెలుచుకున్నారు...అసలు జిల్లాల విభజన పట్ల ప్రజలు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు...ఇంకా జగన్‌కు జనం జేజేలు కొడుతున్నారు...ఇదే వైసీపీ అనుకూల మీడియాలో వచ్చే కథనాలు. అసలు జిల్లాల విభజన పేరుతో జగన్, జనం చెవిలో పువ్వులు పెట్టారు. ఈ ప్రక్రియ వల్ల ప్రజలకు ఒరిగేది ఏం లేదు..విభజన పూర్తిగా తప్పుల తడకగా ఉంది...ఇది టీడీపీ అనుకూల మీడియాలో వచ్చే కథనాలు.

అంటే ఎవరి వర్షన్ వారికి ఉంది...మరి ఈ రెండు మీడియాలు చెప్పే విషయాల్లో ఏది నిజం అంటే...జనం అనుకున్నదే నిజం అని చెప్పొచ్చు. ఆ నిజం పూర్తిగా బయటకు కూడా రాకపోవచ్చు. కానీ వైసీపీ, టీడీపీ అనుకూల మీడియాలు జనం మనసుల్లోకి వెళ్ళిపోయి మరీ చూసినట్లు వేస్తారు...ఇది ముందు నుంచి జరుగుతున్న ప్రక్రియే. అయితే వాస్తవ పరిస్తితులు కాస్త భిన్నంగానే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. వైసీపీ అనుకూల మీడియా అనుకున్నట్లు జిల్లాల విభజనతో జగన్...జనం మనసులు ఏమి గెలుచుకోలేదు. అలాగే జిల్లాల విభజన వల్ల జగన్‌కు వచ్చే నష్టం కూడా లేదు.

కానీ వన్‌సైడ్‌గా జనమంతా తమవైపే ఉన్నారని అనుకోవడం పెద్ద భ్రమ అని చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్తితుల్లో జిల్లాల విభజన వల్ల వైసీపీకి ఒరిగేది ఏమి లేదు...అలా అని టీడీపీకి వచ్చే నష్టమేమీ లేదు. పైగా కొన్ని చోట్ల జిల్లాల విభజన జనంలో చిచ్చు రేపింది. కొన్ని చోట్ల మాత్రం విభజన పట్ల పాజిటివ్‌గానే ఉన్నారు.  అలా అని వారు జగన్ సూపర్ అని అనుకోవడం లేదు.

అసలు జిల్లాల విభజన చేయడం కాదు..ఇప్పుడు 26 జిల్లాల్లో ఆఫీసులు కట్టాలి...ఉద్యోగులని పెట్టాలి...కొత్త కలెక్టరేట్‌లని ఏర్పాటు చేయాలి...అలాగే అన్నీ జిల్లాల్లో అభివృద్ధి జరిగేలా చూడాలి. అప్పుడు జగన్..జనం మనసు గెలుచుకుంటారు...జనమంతా జగన్ వైపే ఉంటారు. అప్పటివరకు జనం సైలెంట్‌గానే ఉంటారు. కానీ ఆ పనులు ఇప్పటిలో మాత్రం అయ్యేలా లేవు. కాబట్టి జనమంతా జగన్ వైపే ఉన్నారనుకోవడం పొరపాటే.

మరింత సమాచారం తెలుసుకోండి: