అమరావతి : ఉద్యోగ సంఘాలు చేస్తున్న  మూడు డిమాండ్లకు కాలం చెల్లిందన్నారు  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పటికే ఉద్యోగుల అకౌంట్లల్లో వేతనాలు  పడ్డాయని.. రెండు డిమాండ్లు నెరవేర్చడం సాధ్య పడదని పేర్కొన్నారు  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.  మిగిలిన డిమాండ్ అయిన పీఆర్సీ రిపోర్టు ఇవ్వడం వల్ల లాభం లేదని.. పట్టుబట్టే బదులు ప్రధాన సమస్యలపై చర్చలకు రావాలని అడిగామని చెప్పారు  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.  డిమాండ్లు తీర్చడానికి అవకాశం లేని పరిస్థితి ఇప్పుడు  ఉందని.. నిన్న సాయంత్రం, ఇవాళ ఉదయం కూడా ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడారని వెల్లడించారు  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.  ఉద్యోగ సంఘాలు అసలు సమస్యల పై మాట్లాడేందుకు రావాలని కోరామన్నారు  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.  కార్యాచరణ వాయిదా వేసుకోవాలని కోరామని.. ఇప్పటి వరకు నేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

రేపు ఉద్యోగులు చేసేది బలప్రదర్శనేనని..  వైషమ్యం పెంచుకోవడం ద్వారా ఏం చేస్తారు..? అన్నారు  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆందోళనలో సంఘ విద్రోహ శక్తులు చొరబడే ప్రమాదం ఉంది.. ఆందోళనపై ఉద్యోగ సంఘాల నాయకులు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని పేర్కొన్నారు  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.  సీపీఎస్ రద్దు, అవుట్ సోర్సింగ్  ఒక పట్టాన తెగేవి కావు.. ఆర్టీసీ వారి సమస్యలు పరిష్కారానికీ చర్యలు తీసుకుంటుండగానే వారినీ తీసుకువచ్చారన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.  ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపినా ఆందోళన చేస్తామంటున్నారు.. ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులపై  అభిమానంతోనే   విలీనం చేశారన్నారు  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఉద్యోగుల సమస్యల పై ప్రభుత్వం  వెనక్కి తగ్గేది లేదని చెప్పడం లేదు,,,ఆర్టీ సీ వారిని కూడా తీసుకు వచ్చి, బస్సులు ఆపి బల ప్రదర్శన చేయాలని చూస్తున్నారన్నారు  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp